నాచురల్ స్టారా మజాకానా.. సిక్స్ కొట్టాడు!

Update: 2019-04-24 05:38 GMT
న్యాచురల్ స్టార్ నాని తాజా చిత్రం 'జెర్సీ' ఏప్రిల్ 19 న రిలీజ్ అయిన సంగతి తెలిసిందే.  గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ తో బాక్స్ ఆఫీస్ దగ్గర దూసుకుపోతోంది. సాధారణ ప్రేక్షకులే కాదు సెలబ్రిటీలు కూడా ఈ చిత్రానికి ఫిదా అవుతున్నారు.  ఇప్పటికే ఈ చిత్రాన్ని ఎన్టీఆర్.. అల్లు అర్జున్.. రాజమౌళి లాంటి ప్రముఖ సెలబ్రిటీలు ప్రశంసించారు.  ఈ చిత్రం డొమెస్టిక్ మార్కెట్ లోనే కాకుండా ఓవర్సీస్ లో కూడా తన సత్తా చాటుతోంది. ఈ సినిమా విడుదలైన ఐదు రోజుల్లో వన్ మిలియన్ డాలర్ మార్క్ ను దాటింది. నిజానికి ఈ చిత్రానికి వచ్చిన పాజిటివ్ టాక్ చూసి మొదటి వీకెండ్ లోనే వన్ మిలియన్ మార్క్ ను టచ్ చేస్తుందని అనుకున్నారు. కానీ కాస్త లేట్ అయింది.  

మన తెలుగు సినిమాలకు వన్ మిలియన్ డాలర్ క్లబ్ అనేది ఒక బెంచ్ మార్క్ గా మారిన సంగతి తెలిసిందే. నాని కెరీర్లో ఇది ఆరవ వన్ మిలియన్ డాలర్ చిత్రం. 'జెర్సీ' క్రికెట్ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం కాబట్టి క్రికెట్ భాషలోనే చెప్పుకుంటే ఈ సినిమాతో నాని ఓవర్సీస్ లో సిక్సర్ కొట్టినట్టే.  ఇప్పటివరకూ నటించిన చిత్రాలలో 'ఈగ', 'భలే భలే మగాడివోయ్', 'నేను లోకల్', 'నిన్నుకోరి', 'ఎమ్ సీఏ' 1 మిలియన్ డాలర్ క్లబ్ లో స్థానం సంపాదించాయి. తాజాగా ఈ లిస్టులో 'జెర్సీ' కూడా చేరింది.

టాలీవుడ్ హీరోలలో ఇలా భారీ సంఖ్యలో వన్ మిలియన్ డాలర్ చిత్రాలు ఉన్న హీరోలలో నాని ఒకరు.  డొమెస్టిక్ మార్కెట్ కు ఓవర్సీస్ మార్కెట్ కు చాలా తేడా ఉంటుంది.  అక్కడి ప్రేక్షకులు రొటీన్ సినిమాలను.. మసాలా ఫార్మాట్ సినిమాలను పెద్దగా ఆదరించరు.  అలాంటి చోట నాని నిలకడగా సత్తా చాటుతున్నాడంటంటేనే నాని స్క్రిప్ట్ ఎంపిక ఎంత చక్కగా ఉంటుందో మనకు అర్థం అవుతుంది.  ఓవర్సీస్ మార్కెట్ లో సత్తా చాటాలనుకునే హీరోలు నానిని ఫాలో అయితే చాలు.. విజయం గ్యారెంటీ!
Tags:    

Similar News