సావిత్రి జీవిత కథతో తెరకెక్కిన ‘మహానటి’ కోసం అలనాటి నటీనటులు.. సాంకేతిక నిపుణుల పాత్రలకు తగ్గ నటీనటుల కోసం చాన్నాళ్ల పాటు వేట సాగించింది చిత్ర బృందం. ఇందులో అన్ని పాత్రలకూ నటీనటులు దొరికారు కానీ.. నందమూరి తారక రామారావు పాత్రను పోషించే నటుడే కరవయ్యాడు. జూనియర్ ఎన్టీఆర్‌ను అడిగారు కానీ.. అతను అంగీకరించలేదు. తన తాత పాత్ర చేసే అర్హత తనకు లేదని తేల్చేశాడు. ఆ విషయాన్నే తాజాగా ‘మహానటి’ ఆడియో వేడుకలోనూ స్పష్టం చేశాడు. తారక్ కాదన్నాక ఈ పాత్ర కోసం నానిని అడిగినట్లు వార్తలొచ్చాయి. మరి నాని ఏమన్నాడో ఏంటో తెలియదు. అతను కూడా ఆ పాత్ర చేయలేదు. చివరికి డిజిటల్ రూపంలోని ఎన్టీఆర్‌ను చూపించి సినిమా లాగించేసినట్లుగా వార్తలొచ్చాయి. మరి నాని ఎందుకు ఈ పాత్ర వద్దన్నాడో తెలియదు మరి.
ఐతే ‘మహానటి’ మేకర్స్ ఈ చిత్రంలో ఓ పాత్ర కోసం తనను సంప్రదించిన మాట మాత్రం వాస్తవమని నాని అంగీకరించాడు. కొన్ని కారణాల వల్ల ఆ పాత్ర చేయలేకపోయానని అతనన్నాడు. ఈ చిత్రంలో అందరూ తనకు కావాల్సిన వాళ్లే అని.. సమంతతో రెండు సినిమాల్లో నటించానని.. ఇదే బేనర్లో నాగ్ అశ్విన్ తో ‘ఎవడే సుబ్రమణ్యం’ చేశానని.. అందులో విజయ్ దేవరకొండ నటించాడని.. ‘నేను లోకల్’ తర్వాత కీర్తి సురేష్ ఫ్యామిలీ మెంబర్ లాగా అయిపోయిందని.. ‘ఓకే బంగారం’లో దుల్కర్ సల్మాన్ కు తానే డబ్బింగ్ చెప్పానని.. ఇలా అందరూ తనకు కావాల్సిన వాళ్లే అని.. ఐతే ఈ సినిమాలో తనకు మాత్రం నటించే అవకాశం లేకపోయిందని.. తన సినిమాలో తాను లేనట్లుగా అనిపిస్తోందని నాని అన్నాడు. నాగ్ అశ్విన్ తో తాను చేసిన ‘ఎవడే సుబ్రమణ్యం’ థియేట్రికల్ ట్రైలర్లో ‘ఫ్రమ్ టాప్ ఆఫ్ ద హిమాలయాస్ టు థియేటర్స్’ అని వేశారని.. ‘మహానటి’ విషయానికి వస్తే ‘ఫ్రమ్ హెవెన్ టు థియేటర్స్’ అని వేస్తే బాగుంటుందని నాని సలహా ఇవ్వడం విశేషం.