ఈమధ్య కాలంలో టాలీవుడ్ లో బాగా ఊపందుకున్న ట్రెండ్ ఏంటంటే లిప్పు లాకులు. గతంలో ఏవైనా ముద్దు సీన్లు వచ్చినప్పుడు మూతులకు అడ్డంగా కర్వేపాకులు.. కొత్తిమీర కట్టలాంటివి చూపించేవారు. ఇప్పుడు వాటితో పనే లేదు. అవసరం ఉన్నా లేకపోయినా ఘాటు లిప్ లాక్స్ ను స్క్రిప్ట్ లో భాగం చేస్తున్నారు. అదేంటి అని ఎవరైనా అడిగితే స్క్రిప్ట్ డిమాండ్ చేసిందని చెప్పొచ్చు కాబట్టి అలా డిసైడ్ అయ్యారన్నమాట. ఇదిలా ఉంటే మన న్యాచురల్ స్టార్ నాని కూడా ఈ లిప్ లాకుల ట్రెండ్ లో భాగం అయిన నటుడే.
అప్పట్లో 'ఆహా కళ్యాణం' అనే సినిమాలో బాలీవుడ్ బ్యూటీ వాణి కపూర్ తో ఆహా అనిపించే ఒక లిప్ లాక్ సీన్ లో నటించాడు. అది ప్రేక్షకులకు ఎంత కిక్కిచ్చిందో తెలీదు కానీ నాని వైఫ్ అంజన మాత్రం చాలా ఫీలయిందట. నానికి అప్పట్లో కొత్తగాపెళ్లయింది. దీంతో అంజన దాదాపు కళ్ళనీళ్ళు పెట్టుకొని ఏడ్చేసిందని ఒక ఇంటర్వ్యూ లో నాని చెప్పుకొచ్చాడు. ఆ తర్వాత లిప్ లాక్ సీన్లలో నటించలేదు నాని. అప్పటినుంచి నాని లిప్ లాక్ అనే పదానికి కాస్త దూరంగా జరిగినట్టు అనిపిస్తోంది.
నాని ప్రస్తుతం 'జెర్సీ' అనే స్పోర్ట్స్ డ్రామా లో నటిస్తున్నాడు కదా. ఈ సినిమా నుండి ఒక పాట ను విడుదల చేశారు. రొమాంటిక్ గా సాగే ఈ పాటలో ఒక కిస్ సీన్ ఉంది. కాకపోతే హీరోయిన్ శ్రద్ధ శ్రీనాథ్ పెదవుల దగ్గరకు తన పెదవులను తీసుకెళ్ళి అక్కడ రైట్ టర్న్ తీసుకొని పక్కన కిస్ చేస్తారు నాని గారు. కన్నడ 'U టర్న్' ఫేమ్ శ్రద్ధ కు లిప్ లాక్ సీన్లలో నటించడం వెన్నతో పెట్టిన విద్య. తజాగా తన డెబ్యూ హిందీ సినిమా 'మిలన్ టాకీస్' కోసం హీరో అలీ ఫజల్ కు ఘాటు ముద్దులిచ్చింది. కానీ నాని మాత్రం అలాంటి ఘాటు భామకు మూతిపై కాకుండా మూతి అవుట్ స్కర్ట్స్ లో ఔటర్ రింగ్ రోడ్ దాటి ఎక్కడికో వెళ్లి కిస్ ఇచ్చాడు. రియల్ లైఫ్ లో భార్య ఫీలయితే.. అంతేగా అంతేగా!