అంజ‌న‌..న‌జ్రియా మ‌ధ్య‌లో నాని!

Update: 2022-06-09 09:12 GMT
నేచుర‌ల్ స్టార్ నాని క‌థానాయ‌కుడిగా న‌టించిన 'అంటే సుంద‌రానికీ' రిలీజ్ కౌంట్ డౌన్  మొద‌లైంది. ఇంకొన్ని గంట‌ల్లో సుంద‌రం ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నాడు. ఇప్ప‌టికే రిలీజ్ అయిన ప్రచార చిత్రాల‌తో సినిమాకి అన్ని వైపులా పాజిట‌వ్ బ‌జ్ క్రియేట్ అయింది. నాని సినిమాపై భారీ ఆశ‌లే పెట్టుకున్నారు. 'జెర్సీ' త‌ర్వాత నానికి స‌రైన స‌క్సెస్ ప‌డ‌లేదు.

'గ్యాంగ్ లీడ‌ర్'.. 'వి'.. 'ట‌క్ జ‌గ‌దీష్'..'శ్యామ్ సింఘ‌రాయ్' ఆశించిన ఫ‌లితాలు సాధించ‌లేదు. దీంతో సుంద‌రం స‌క్సెస్ కీల‌కంగా మార‌బోతుంది? అన్న విశ్లేష‌ణ్  తెర‌పైకి వ‌స్తోంది. మ‌రికొన్ని  గంట‌ల్లో సుంద‌రం నాని ఫేట్ ని మార్చ‌బోతుంద‌ని తెలుస్తోంది. ఈ నేప‌థ్యంలో సినిమా ప్రీ రిలీజ్  లెక్క‌లు వెలుగులోకి వ‌స్తున్నాయి.

ఈ సినిమా వ‌ర‌ల్డ్ వైడ్   థియేట్రిక‌ల్ రైట్స్ 28 కోట్ల‌కు అమ్మ‌డుపోయాయి. నైజాం-9 కోట్లు.. సీడెడ్ -3 కోట్లు.. ఆంధ్ర‌- 10 కోట్లు..ఏపీ తెలంగాణ మొత్తం క‌ల‌ప‌గా 22 కోట్లు బిజినెస్ జ‌రిగింది. ఇక రెస్టాప్ ఇండియా -2.5 కోట్లు..ఓవ‌ర్సీస్ 3.50 కోట్లు మొత్తం వ‌ర‌ల్డ్ వైడ్ బిజినెస్ 28 కోట్లని తెలుస్తోంది. ఇక అడ్వాన్స్ బుకింగ్ ల ప‌రంగా చూస్తే దేశీయ మార్కెట్ తో పోలిస్తే ఓవ‌ర్సీల్ బాగున్నాయి.

బుకింగ్స్ అక్క‌డా జోరుగా సాగుతున్నాయి. దీంతో సినిమా మౌత్ టాక్ కీల‌కంగా మారే అవ‌కాశం క‌నిపిస్తుంది. తెలుగు రాష్ర్టాల్లో సినిమా విజ‌యం సాధించాంలే సినిమాకి పాజిటివ్ టాక్ రావాలి...అది మౌత్ టాక్ తో జ‌నాల్లోకి దూసుకుకెళ్ల‌గ‌ల‌గాలి. లేదంటే బ్రేక్ ఈవెన్ క‌ష్ట‌మేనన్న సంకేతాలు వినిపిస్తున్నాయి. పైగా  నాని గ‌త చిత్రాలు  కూడా ఆశించిన ఫ‌లితాలు సాధించ‌లేదు.

వాటి ప్ర‌భావం సైతం కొంత వ‌ర‌కూ సుద‌రంపై ప‌డుతుంద‌ని ఇప్ప‌టికే  మీడియా క‌థ‌నాలు వేడెక్కిస్తున్నాయి. మ‌రి సుంద‌రం వీట‌న్నింటి ఎలా ఓవ‌ర్ క‌మ్ చేస్తాడ‌న్న‌ది చూడాలి. ఇక సుంద‌రం ఓటీటీ రిలీజ్ వేదిక కూడా ఖ‌రారైంది.  ఈ విష‌యాన్ని చిత్ర నిర్మాత‌లు అధికారికంగా ఇన్ స్టా  ప్రోపైల్ ద్వారా రివీల్ చేసారు.

 'అంటే సుంద‌రానికీ' ఓటీటీ స్ర్టీమింగ్ హ‌క్కులు నెట్ ప్లిక్స్ ద‌క్కించుకుంద‌ని ప్ర‌క‌టించారు. అలాగే సినిమాని థియేట‌ర్లోనే చూడాల‌ని టెంప్ట్ చేసే ప్ర‌య‌త్నం చేసారు. ఓటీటీ లో సినిమా చూడ‌టం ఇప్పుడే వీలుప‌డ‌దని..అందుకు చాలా స‌మ‌యం ప‌డు తుంద‌ని...కాబ‌ట్టి ప్రేక్ష‌కులంతా థియేట‌ర్ కి వెళ్లి సుంద‌రాన్ని చూడాల్సింద‌ని  విజ్ఞప్తి చేసారు.

మ‌రోవైపు సినిమాకి సంబంధించి ప్ర‌చారం జోరుగా సాగుతోంది. రిలీజ్ కి కొన్ని గంట‌లే స‌మ‌యం ఉండ‌టంతో టీమ్ సోష‌ల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం నిర్వ‌హిస్తున్నారు. దీనిలో భాగంగా హీరోయిన్ నజ్రియా న‌జీమ్ షేర్ చేన‌సిన  వీడియో ఒక‌టి నెట్టింట  దూసుకుపోతుంది. ఇందులో నాని నారీ నారీ న‌డుమ మురారీ చందంగా ఆక‌ట్టుకుంటున్నాడు.

సినిమా లో ప్రమోష‌న్ ల్ సాంగ్ కి అంజ‌న‌..న‌జ్రియా డాన్స్ చేస్తుండ‌గా వారిద్ద‌రి మ‌ధ్య‌లోకి నాని దూరాడు. వాళ్లిద్ద‌రితో పాటు నాని కూడా క‌లిసి డాన్సు చేసి అల‌రించాడు. నాని భార్య‌ అంజ‌న కూడా మంచి డాన్స‌ర్ అని తెలుస్తుంది. న‌జ్రియా లా స్టెప్పుల్ని దించేసారు. ఈ వీడియో గురుంచి  న‌జ్రయా మాట్లాడుతూ...

నాని..అంజ‌న‌తో క‌లిసి రీల్ చేయ‌డం చాలా ఆనందంగా ఉంద‌న్నారు. ప్ర‌స్తుతం ఈ వీడియో నెట్టింట వైర‌ల్ గా మారింది. న‌జ్రియాకి యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉండ‌టంతో జోరుగా వైర‌ల్ అవుతుంది. వీడియో చూసిన ప‌లువురు సెల‌బ్రిటీలు సైతం కామెంట్లు చేస్తున్నారు. వావ్..సో క్యూట్ అంటూ ఈ ముగ్గుర్ని ఆకాశానికి ఎత్తేస్తున్నారు.


Tags:    

Similar News