2 గంటల 48 నిమిషాలా?? వామ్మో!!

Update: 2016-01-12 12:20 GMT

ఇంతకీ ''నాన్నకు ప్రేమతో'' సినిమా రన్‌ టైమ్‌ ఎంతో తెలుసా? ఎన్టీఆర్‌ హీరోగా రూపొందిన ఈ సినిమకు ''యు/ఎ'' సర్టిఫికేట్‌ వస్తేనే వామ్మో అనుకున్న అభిమానులు ఇప్పుడు ఇంకాస్త షాక్‌ కు గురవుతున్నారు. అసలు సినిమా నిడివి తెలుసుకుంటే గుండెల్లో గుబేల్‌ అంటోంది.

అక్షరాలా 168 నిమిషాలు.. అంటే 2 గంటల 48 నిమిషాల సినిమాను రేపు తెలుగు ప్రేక్షకులు చూడనున్నారు. ఒకవేళ టైటిల్స్‌ కోసం ఒక 8 నిమిషాలు తీసేసినా కూడా రెండున్నర గంటలపైన మరో పది నిమిషాలు చూడాల్సిందే. ఈ మధ్య కాలంలో ఎక్కువ నిడివి ఉన్న సినిమాలు కాస్త ఇబ్బంది పెట్టేస్తున్నాయి. గతంలో సుకుమార్ తీసిన 1 నేనొక్కడినే కూడా ఇదే రన్‌ టైమ్‌ తో సతమతమైంది. ఇక 162 నిమిషాలు ఉన్న ఆగడు వంటి సినిమాలు అట్టర్‌ ఫ్లాపులుగా మిగిలాయి.  కాకపోతే 158 నిమిషాలు ఉన్న బాహుబలి.. 163 నిమిషాలున్న శ్రీమంతుడు భారీ హిట్లయ్యాయ్‌.

సో.. కంటెంట్‌ లో దమ్ముంటే రన్‌ టైమ్‌ ఎంతున్నా కూడా సినిమా ఆడుతుంది. అంతగా కంగారుపడాల్సిన అవసరం లేదు.
Tags:    

Similar News