నారా వారబ్బాయికి న్యూఇయర్ చాలా స్పెషల్

Update: 2016-12-30 03:45 GMT
ప్రపంచ ప్రజలు కొత్త సంవత్సర వేడుకలు జరుపుకునేందుకు మరొక్క రోజు గ్యాప్ మాత్రమే ఉంది. డిసెంబర్ 31.. జనవరి 1 తేదీల్లో అందరూ సంబరాల్లో మునిగి తేలడం ఖాయం. అలాగే కొత్త ఏడాది కోసం కొత్త నిర్ణయాలు తీసుకోవడం కూడా జరుగుతూ ఉంటుంది. అందరూ అన్నీ చేసేస్తారని కాదు కానీ.. కొందరు మాత్రం తాము తీసుకున్న నిర్ణయాలకు కట్టుబడి ఉంటారు. టాలీవుడ్ హీరో నారా రోహిత్ కూడా 2017 కోసం ఓ విప్లవాత్మకమైన నిర్ణయం తీసుకున్నానంటూ... ఇంగ్లీష్ డైలీ డెక్కన్ క్రానికల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పాడు.

యాక్టింగ్.. పెర్ఫామెన్స్.. స్టోరీ సెలక్షన్.. ఇలాంటి విషయాల్లో నారావారబ్బాయికి మంచి మార్కులే పడుతున్నా ఫిజిక్ విషయంలో మాత్రం బోలెడన్ని విమర్శలు ఉన్నాయి. తగ్గిపోతానని.. సిక్స్ ప్యాక్ చేయబోతున్నానని చెబుతుంటాడు కానీ.. ఇప్పటివరకూ పాటించలేదు. కానీ 2017లో మాత్రం కచ్చతంగా తాను తన శరీరాకృతి మార్చుకోబోతోన్నాడట. న్యూ ఇయర్ సందర్భంగా తీసుకున్న నిర్ణయం ఇదే అన్న నారా రోహిత్.. మరో గుడ్ న్యూస్ కూడా వినిపించాడు.

'నా పేరెంట్స్ కి నేను పెళ్లి చేసుకునేందుకు సిద్ధం అని చెప్పేశాను. ప్రస్తుతం వారు అమ్మాయిని వెతికే పనుల్లో ఉన్నారు. వచ్చే ఏడాది నా పెళ్లి అయిపోవచ్చు కూడా' అని చెప్పాడు నారా రోహిత్. 2017 మరో రకంగా కూడా నారా రోహిత్ కి స్పెషల్ కానుంది. తొలిసారిగా తానే నిర్మించిన మూవీ అప్పట్లో ఒకడుండేవాడు ఈరోజే విడుదల అవుతోంది. దాని రిజల్ట్ ఏంటో తెలిసేసరికి కొత్త  సంవత్సరం వచ్చేస్తుందిగా!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News