టాలీవుడ్ హీరో నవదీప్ చాలా కాలం తర్వాత ప్రేక్షకులను సందడి చేయడానికి రెడీ అయ్యారు. ఈ మధ్య సినిమాలకు దూరమైన ఆయన వెబ్ సిరీస్ తో మన ముందుకు రాబోతున్నారు. ‘న్యూసెన్స్’ పేరిట ఈ వెబ్ సిరీస్ ని తెరకెక్కించారు. ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహాలో ఈ వెబ్ సిరీస్ విడుదలకు సిద్ధమైంది. మే 12 నుంచి ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ అవుతుంది.
ఈ వెబ్ సిరీస్ లో బిందు మాధవి కీలక పాత్ర పోషించారు. ప్రవీణ్ కుమార్ దర్శకత్వం వహించారు. ఇప్పటికే విడుదల చేసిన ట్రైలర్ విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఒకప్పుడు మీడియా ఉన్నట్లు ఇప్పుడు మీడియా లేదు అని అని తెలియజెప్పేలా ఈ వెబ్ సిరీస్ తెరకెక్కించినట్లు తెలుస్తోంది.నేటి మీడియా ప్రజలపై ఎలాంటి ప్రభావం చూపుతుందో ఇందులో తెలియజేస్తున్నారు.
ఈ సిరీస్ టీజర్ విడుదల చేసిన సమయంలో డబ్బుకి మీడియా దాసోహమా అంటూ ఓ లైన్ కూడా పెట్టారు. ఇది సెన్సేషన్ గా మారింది. ఇదే అంశాన్ని వెబ్ సిరీస్ లో ఎలా చూపించారు..? మీడియాను పాజిటివ్ గా చూపించారా లేక నెగిటివ్ చూపించారా అనే ఆసక్తికర విషయాలు తెలియాలంటే ఆహాలో స్ట్రీమింగ్ అయ్యే వరకు ఆగాల్సిందే.
రాజకీయాలు, హత్యలు, దోపిడీలు ఇలా అన్ని అంశాలపై మీడియా ఎలా చూపిస్తోందన్న కోణంలో ట్రైలర్ సాగింది. ఇందులో నవదీప్ ఓ మీడియా రిపోర్టర్ గా కనిపిస్తున్నారు. ‘బలమున్నోడికి చేతులెత్తి మెక్కాలా, రాళ్లు విసరకూడదు’ అంటూ నవదీప్ చెప్పే డైలాగ్ ఆకట్టుకుంటోంది. నవదీప్, బిందు మాధవి మధ్య వచ్చే సన్నివేశాలు యువతను ఆకట్టుకునేలా ఉంటాయని ట్రైలర్ చూస్తే అర్థమౌతుంది.
ఇక, నవదీప్ జై సినిమాతో సినీ ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. ఆ తర్వాత హీరోగా పలు సినిమాలు నటించాడు. ఆ తర్వాత విలన్ పాత్రలు కూడా చేశాడు. ఇప్పుడు వెబ్ సిరీస్ తో మన ముందుకు వస్తున్నాడు. మరి ఈ సిరీస్ తర్వాత నవదీప్ కెరీర్ ఎలా మారుతుందో చూడాలి.
కాగా ఈ వెబ్ సిరీస్ నేపథ్యంలో నవదీప్, బిందు మాధవి ప్రమోషన్స్ లో చురుకుగా పాల్గొంటున్నారు. ఈ ప్రమోషన్స్ లో భాగంగానే నవదీప్ తనపై వచ్చిన రూమర్స్ కి చెక్ పెట్టాడు. ఇక బిందు మాదవి బోల్డ్ స్టేట్మెంట్ చేయడం గమనార్హం.