మరోసారి ఆయన్ను నయన్ నమ్మదేమో!!
కోలీవుడ్ స్టార్ హీరోయిన్ నయనతార. ఈ అమ్మడు లేడీ సూపర్ స్టార్ ఇమేజ్ తో అభిమానులతో ఆరాధించబడుతుంది. ఈమె చేసే లేడీ ఓరియంటెడ్ చిత్రాలు స్టార్ హీరోల సినిమాల స్థాయిలో వసూళ్లను దక్కించుకుంటున్నాయి. ఇలాంటి సమయంలో ఈమె నటించిన దర్బార్ చిత్రం ఆమె అభిమానులను తీవ్రంగా నిరాశ పర్చింది. దర్బార్ చిత్రంలో నయనతార పాత్ర మరీ గెస్ట్ రోల్ లాగే ఉంది. హీరోయిన్ అని పేరు కాని ఎక్కువగా స్కోప్ ఇవ్వలేదు.
గతంలో మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన గజినీ చిత్రంలో కూడా నయనతార నటించి నిరాశ పడింది. ఆ సినిమాలో పాత్ర విషయంలో మొదట చెప్పింది ఒకటి ఫైనల్ కట్స్ లో ఉన్నది ఒకటి. ఆ సమయంలోనే మురుగదాస్ పై నయనతార చాలా ఆగ్రహం వ్యక్తం చేసింది. మళ్లీ ఇప్పుడు అదే తరహాలో నయనతార మోసపోయింది. దర్బార్ చిత్రంలో మీ పాత్ర చాలా ప్రాముఖ్యతను కలిగి ఉంటుందని మురుగదాస్ చెప్పాడట. రజినీకాంత్ కు జోడీగా నటింపజేశాడట.
తీరా ఇటీవల విడుదలైన దర్బార్ చిత్రంలో ఈ అమ్మడి పాత్ర మరీ నిరాశపర్చింది. దర్బార్ చిత్రంలో ఈ అమ్మడు స్కిన్ షో కే పరిమితం అయ్యింది. అసలు చాలా సీన్స్ ను షూట్ చేసి తొలగించడం జరిగిందట. దాంతో దర్శకుడు మురుగదాస్ పై నయన్ మళ్లీ ఆగ్రహం వ్యక్తం చేసిందట. మరోసారి మురుగదాస్ ను నయన్ నమ్మకపోవచ్చు అంటూ సినీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.