అసలు ఒక హీరోయిన్ ఇండస్ర్టీలోకి అడుగు పెట్టాక.. ఒక 10 సంవత్సరాల్లో కెరియర్ ఖేల్ కతమ్ అయిపోతుంటుంది. కాని కొంతమంది మాత్రం.. సరిగ్గా 10 సంవత్సరాల్లో కావల్సినంత మెట్యూరిటీ సంపాదించి.. చక్కగా పెద్ద స్టార్ అయిపోతారు తెలుసా? కావాలంటే కరీనా కపూర్ ను చూడండి. ఎప్పుడో 2001లో అడుగుపెట్టిన ఈ సుందరి.. ఒక నాలుగేళ్ళ క్రిందటేగా స్టార్ స్టాటస్ ను సాధించింది. సౌత్ లో కూడా సేమ్ అలాంటి హీరోయినే మన నయనతార.
అప్పుడెప్పుడో 2003లో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన నయన్.. ఆ మధ్యన ప్రభుదేవాతో బ్రేకప్ అయ్యాక 2013లో రీ-ఎంట్రీ ఇచ్చింది చూడండి.. అప్పటినుండి దశ తిరిగింది. పైగా అమ్మడు బొద్దుగా ఉండేదిగా.. అక్కడ నుండి కాస్త సన్నబడింది.. ఇప్పుడు మరీ సైజ్ జీరో టైపులో తయారైంది. ఆ దెబ్బకి ఆఫర్లే ఆఫర్లు అనుకోండి. ఇప్పుడు మరో హాట్ న్యూస్ ఏంటంటే.. అమ్మడు సైమా 2016 అవార్డుల్లో.. ఏకంగా ఒకేరోజున రెండు బెస్ట్ యాక్టర్ (ఫిమేల్) ట్రోఫీలు అందుకుంది. భలే హైలైట్ కదూ.
ఈమె ప్రియుడు విఘ్నేష్ శివన్ తీసిన 'నానుమ్ రౌడీ దాన్' సినిమాలోని నటనకు గాను తమిళ బెస్ట్ యాక్టర్ అవార్డునూ.. అలాగే మలయాళంలో నటించిన 'భాస్కర.. ది రాస్కెల్' సినిమాకు గాను అక్కడ కూడా బెస్ట్ యాక్టర్ గా నయనతారే రేసును గెలిచింది. అలా సైమా వారు రెండు ట్రోఫీలను ఆమె చేతిలోనే పెట్టారు మరి. కంగ్రాట్స్ నయన్.