మాజీ లవర్స్ పేర్లు పెడుతున్న నయన్

Update: 2016-02-03 22:30 GMT
హీరోయిన్ గా నయనతార ఎంత ఫేమస్సో.. లవ్ ఎఫైర్లు నడపడంలోనూ అంతే ఫేమస్. అఫైర్లు - బ్రేకప్ లు ఈమె కెరీర్ లో బోలెడన్ని ఉంటాయి. స్టార్ హీరోలతో అఫైర్స్ నడిపేసి.. వాటికి బ్రేకప్ చెప్పేసి, మళ్లీ ఎంచక్కా సినిమాలు చేసేసుకుంటూ ఉంటుంది ఈ సుందరాంగి. ఇలాంటి బ్రేకప్ ల తర్వాత వాళ్లతో సినిమాలు చేసేందుకే కాదు.. పేర్లు ఎత్తేందుకు కూడా హీరోయిన్స్ ఇష్టపడరు. కానీ నయన్ రూటు సెపరేటు.

ప్రస్తుతం ఇదు నమ్మ ఆళు అంటూ తమిళ్ లో ఓ మూవీ వస్తోంది. ఇందులో మాజీ లవర్స్ నయన తార - శింబు కలిసి నటిస్తున్నారు. ఇదే ఓ సెన్సేషన్ అయితే.. ఇందులో వీరి రోల్స్ కూడా అవే. ముందు ప్రేమించేసుకుని, తర్వాత విడిపోయే జంట. అయితే.. ఈ మూవీ ట్రైలర్ లో నయనతార లవ్ ఎఫైర్స్ పై పంచ్ లు ఉండడం ఆశ్చర్యం కలిగించే విషయం. లవర్స్ ఇద్దరూ మాట్లాడుకునే టైంలో.. పిల్లలకేం పేర్లు పెడదాం అని శింబు అడిగితే.. ఆర్య - శింబు - ధనుష్ ఇలాంటి పేర్లేం నచ్చలేదా నీకు అంటుంది నయన్. పైగా పక్కనే ఓ కమెడియన్ తో.. 'మాజీ లవర్స్ పేర్లు వరుసగా చెబ్తోందిరా' అంటూ డైలాగ్ కూడా చెప్పించేశారు.

వీళ్లంతా నయన్ మాజీ లవర్స్ అని అందరికీ తెలుసు. పైగా ఇప్పుడు రజినీకాంత్ కూతురుని ధనుష్ చక్కగా పెళ్లి చేసేసుకుని భేషుగ్గా కాపురం చేసుకుంటున్నాడు. ఇలాంటి టైంలో.. పాత కథలను తవ్వడం నయన్ కి ఏమన్నా న్యాయమా అంటున్నారు రజినీ ఫ్యాన్స్. అయినా.. ఓ సినిమాలో కామెడీ కోసం ఇలా పాత లవర్స్ పేర్లు వరుసగా చెప్పిందంటే.. నయన్.. నువ్వు కేక అంతే.

Tags:    

Similar News