నయన పెళ్లి నిజమేనా?

Update: 2017-10-28 09:14 GMT
చిరునవ్వు తో సిగ్గుపడుతూ సౌత్ ఇండస్ట్రీ ప్రేక్షకుల మనసును దోచుకున్న ముద్దుగుమ్మ నయనతార. కనిపించినప్పుడల్లా ఆకాశంలో ఉన్న తారలా మెరుస్తూ ఉంటుంది. జీవితంలో కొన్ని చేదు అనుభవాలను ఎదుర్కొన్నా కూడా ఎండాకాలం పోయి వర్షా కలం వచ్చినట్టు భాదలనే వేడిని వదిలేసి సంతోషం అనే చిరు జల్లులోకి వచ్చేస్తోంది. లైఫ్ లో ఎన్ని రాంగ్ రూట్స్ లో వెళ్లినా మళ్లీ యూ టర్న్ తీసుకోవడం ఈమెకు అలవాటే.

అందుకే దారిలో మీడియా కనిపించినా మాట్లాడదు. ఆమె తెలివో లేక అదృష్టమే తెలియదు గాని కెరీర్ ని మాత్రం ఇప్పటివరకు ఒక లెవెల్ లో సెట్ చేసుకుంటూ వస్తోంది. మరో ఐదేళ్లు అదే లెవెల్ లో ఉండేట్లు అవకాశాలను కూడా దక్కించుకొంది. నయన సినీ లైఫ్ ఒకే గాని పర్సనల్ లైఫ్ ని మాత్రం జవాబు దొరకని ప్రశ్నగా మార్చుకుంటోంది. అసలు విషయంలోకి వస్తే నయనకి ఈ మధ్య పెళ్లి జరిగిందని వార్తలు చాలానే వస్తున్నాయి. శింబు - ప్రభు దేవా వంటి స్టార్స్ తో ప్రేమాయణాన్ని కొనసాగించి విఫలం అయినా.. ఆ తర్వాత యువ దర్శకుడైన విగ్నేష్ శివన్ తో సాన్నిహిత్యాన్ని బాగానే పెంచుకుంది.

అతని పుట్టిన రోజు వేడుకలను అమెరికాలో ఘనంగా చేసి అతనికి మర్చిపోలేని హ్యాపీ ని ఇచ్చింది. ఆ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా విగ్నేష్ అప్పుడే చెప్పాడు. అయితే రీసెంట్ గా వారిద్దరూ ఆర్య సమాజ్ లో పెళ్లి చేసుకోనున్నారని కోలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది. అంతే కాకుండా చెన్నై లో ఒక విల్లాను కూడా కొనేసి పెళ్లి తర్వాత అందులో ఉంటున్నారని రూమర్స్ గట్టిగానే వినిపిస్తున్నాయి. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియదు గాని వారిద్దరి మధ్య ప్రేమ మాత్రం తార స్థాయిలో కొనసాగుతుందని సినీ ఇండస్ట్రీలో మాట్లాడుకుంటున్నారు.
Tags:    

Similar News