సౌతిండియా మొత్తంలో ఎక్కువ డిమాండ్, సక్సెస్ రేట్ ఉన్న హీరోయిన్ ఎవరంటే.. మలయాళ బ్యూటీ నయనతార పేరు మాత్రమే వినిపిస్తుంది. ప్రస్తుతం తమిళ్ లో శింబుతొ ఇదు నమ్మ ఆలు - జీవా తిరనాళ్ సినిమాలను రిలీజ్ కి రెడీ చేసిన నయన్... కార్తీ - విక్రమ్ లతో చెరొక సినిమా చేస్తోంది. ఇది కాక త్వరలో శివ కార్తికేయన్ తో జత కడుతోంది. ఇవి కాక.. టాలీవుడ్ లో మెగాస్టార్ రీఎంట్రీ కోసం కూడా నయన్ నే ఎంచుకున్నారు. బాలయ్య 100 వ చిత్రంలోనూ ఈమెనే అడుగుతున్నారు.
భారీ పారితోషికం తీసుకుంటున్నా ఇంత డిమాండ్ ఉన్న హీరోయిన్ నయన తార.. ఇప్పుడు కొత్త పాత్రలోకి ఎంటర్ అవుతానంటోంది. సినిమా నిర్మాణంపై ఆసక్తి చూపిస్తోందనే ప్రచారం జరుగుతోంది. హీరోయిన్లు నిర్మాతలుగా మారడం కొత్త కాదు కానీ.. టాప్ రేంజ్ లో వెలిగిపోతున్న ప్రొడ్యూసర్ రోల్ లోకి మారడం అంటే కాసింత రిస్కీ వ్యవహారమే. అయినాసరే తను నిర్మాతగా సినిమా తీయాల్సిందే అంటోందట నయన్.
నయన్ లేటెస్ట్ లవర్ డైరెక్టర్ విఘ్నేష్ శివ. ఇతని దర్శకత్వంలో రూపొందనున్న చిత్రంలో నటించేందుకు అంగీకరించింది. ఈ స్క్రిప్ట్ విన్నాక తనే ప్రొడ్యూస్ చేయాలనే ఆసక్తిని చూపించిందట. మే నెల మధ్యలో షూటింగ్ ప్రారంభం కానున్న ఈ మూవీపై.. మరిన్ని వివరాలు వెల్లడి కావాల్సి ఉంది.