2019 సంక్రాంతి బరిలో వచ్చిన చిత్రాల్లో `వినయ విధేయరామ` డిజాస్టర్ లకే బాప్ గా నిలిచిన సంగతి తెలిసిందే. `పేరులోనే వినయం వుంది కానీ సినిమాలో అంతా విలయమే కనిపిస్తోంది` అని ఈ సినిమా ప్రీ రిలీజ్ వేదిక సాక్షిగా తెలంగాణ మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేసి బోయపాటి గుండెల్లో ఆయన డేంజర్ బెల్స్ మోగించారు. అయినా అతి విశ్వాసంతో అతి హింసతో బోయపాటి శ్రీను చేసిన ఈ చిత్రం అతని కెరీర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది. ఆ తరువాత సినిమా ఏంటీ? అనే ప్రశ్నార్థకంలో పడేసింది. ఆ సినిమా తర్వాత ఏ హీరో అతడికి ఛాన్స్ ఇచ్చేందుకే సాహసించలేదన్న విమర్శలు వచ్చాయి.
చివరికి బాలయ్య కూడా కథ మార్చాలని .. పూర్తి కథ చెప్పి తీరాలని సవాలక్ష కండిషన్లు పెట్టారన్న ప్రచారం సాగింది. నేను పిలిచేంత వరకు వేచి వుండమని వాయిదా వేయడంతో అది కాస్తా ఇంతకాలం తాత్సారమైంది. తనకు కెరీర్ బెస్ట్ హిట్లు ఇచ్చిన బోయపాటికి ఇలాంటి సన్నివేశం ఊహించనిది. అయితే ఎట్టకేలకు ఎంతో ఓపిగ్గా ఎదురుచూసిన బోయపాటి మొత్తానికి బాలకృష్ణతో సినిమాని ఈ శుక్రవారం పట్టాలెక్కిస్తున్నారు.
హైదరాబాద్ లో లాంఛనంగా సినిమా ప్రారంభమవుతోంది. ఎంతో భారీ హంగామాతో ఈ చిత్రాన్ని ప్రారంభించడానికి ఏర్పాట్లని నిర్మాత మిర్యాల రవీందర్‌రెడ్డి పూర్తి చేశారు. ఈ సినిమాతో మళ్లీ తనపై వచ్చిన విమర్శలకు చెక్ పెట్టాలనే పట్టుదలతో బోయపాటి వున్నట్టు తెలుస్తోంది. మాంచి ఫామ్ లో వున్న తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్ర ప్రారంభోత్సవానికి హేమా హేమీలు హాజరు కాబోతున్నారట.