నందమూరి బాలకృష్ణ అఖండ సినిమా తర్వాత మరో మాస్ యాక్షన్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. క్రాక్ సినిమా తర్వాత గోపీచంద్ మలినేని దర్శకత్వంలోకి రాబోతున్న NBK 107 సినిమాపై అంచనాలు ఇప్పటికే ఊహించని విధంగా పెరిగిపోయాయి. తప్పకుండా బాలయ్యను ఈ దర్శకుడు అంతకుమించి అనేలా చూపిస్తాడు అనే నమ్మకంతో ఉన్నారు. ఇక ఈ సినిమాకు టైటిల్ ఏమిటి అనే విషయంలో ఇదివరకే చాలా రకాల రూమర్లు అయితే వచ్చాయి.
అయితే ఇప్పటివరకు చిత్ర యూనిట్ సభ్యులు ఆ విషయంలో ఒక క్లారిటీ కూడా ఇవ్వలేదు. ఆ మధ్యలో 'రెడ్డి గారు' అనే టైటిల్ కూడా చర్చల దశలో ఉన్నట్లు టాక్ వచ్చింది. అంతేకాకుండా జై బాలయ్య అనే టైటిల్ కూడా ట్రెండ్ అవుతుంది.
కాబట్టి అదే ఫిక్స్ చేయాలని అనుకున్నట్లు కూడా మరొక కొత్త టాక్ వినిపించింది. అయితే దర్శకుడు గోపీచంద్ మాత్రం ఆ రెండు టైటిల్స్ కాకుండా వింటేజ్ బాలయ్యను ఫ్యాక్షనిజం లో చూపిస్తున్నాడు కాబట్టి టైటిల్ కూడా అదే తరహాలో ఉండాలి అని ఆలోచించారట.
'వీర సింహారెడ్డి' అనే టైటిల్ పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది అని కథకు కూడా అది దగ్గరగా ఉంటుంది అని ఇటీవల బాలయ్య బాబుతో చర్చించినట్లుగా తెలుస్తోంది. బాలయ్య బాబు కూడా ఆ టైటిల్ పై సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. సినిమాను ఎప్పుడు విడుదల చేస్తారో అనే విషయంలో కూడా నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ సినిమాను సంక్రాంతి బరిలో నిలిపే అవకాశం ఉన్నట్లు ఇదివరకే ఒక టాక్ కనిపించింది.
ఇక డేట్ విషయంలో అఫీషియల్ గా క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. ప్రస్తుతం వినిపిస్తున్న టాక్ ప్రకారం అయితే జనవరి 11వ తేదీన సినిమాను విడుదల చేయాలని అనుకుంటున్నట్లు సమాచారం. ఇక అదే సమయానికి మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య తో పాటు ప్రభాస్ ఆదిపురుష్ సినిమా కూడా సంక్రాంతి బరిలో నిలవబోతున్నాయి. వీటితో పాటు విజయ్ వారసుడు కూడా రానుంది. మరి ఈ పోటీలో బాలయ్య బాబు ఏ విధంగా గర్జిస్తారో చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.