ఏడేళ్లవుతోంది ‘రెడీ’ సినిమా వచ్చి. ఇప్పుడు చూసినా ఆ సినిమాకు ఈజీగా కనెక్టయిపోతాం. తెలుగులో ఈ సినిమా స్ఫూర్తితో పదుల సంఖ్యలో వచ్చాయి. ఈ సినిమాకు ముందు వరకు రామ్ చిన్న హీరోలా ఉన్నాడు. కానీ దీని తర్వాత అతడి రేంజే మారిపోయింది. తెలుగు పరిశ్రమకు మరో స్టార్ దొరికాడనుకున్నారంతా. కానీ ఆ తర్వాత స్థాయికి తగ్గ సినిమాలు చేయక వెనకబడిపోతూ వచ్చాడు ఈ ఎనర్జిటిక్ హీరో. మధ్యలో ‘కందిరీగ’ హిట్టయింది కానీ.. ఆ సినిమాను జనాలు అంతగా గుర్తుంచుకోలేదు. ‘కందిరీగ’ రామ్ గా కంటే ‘రెడీ’ రామ్ గానే ఈ హీరోను గుర్తుంచుకున్నారు. రామ్ కెరీర్లో చివరగా వచ్చిన నిఖార్సయిన హిట్టు ఏదంటే మాత్రం అందరికీ ‘రెడీ’నే గుర్తుకొస్తుంది.
మధ్యలో చెత్త చెత్త సినిమాలు చేసి పేరంతా పోగొట్టుకున్న రామ్.. ఎట్టకేలకు ఓ మంచి సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ‘నేను శైలజ’ రామ్ పెర్ఫామెన్స్ పరంగా, కొత్తదనం పరంగా, ప్రేక్షకుల్ని ఆకట్టుకునే విషయంలో.. ఇలా అన్ని విధాలుగా ‘రెడీ’ తర్వాత రామ్ కు బెస్ట్ మూవీ అనడంలో సందేహమే లేదు. ఫస్డ్ డే పాజిటివ్ నోట్ తో మొదలైన ఈ సినిమా అన్ని చోట్లా హౌస్ ఫుల్స్ తో రన్ అవుతోంది. తొలి రోజు రూ.6.57 కోట్ల గ్రాస్ వసూలు చేసింది ‘నేను శైలజ’. అందులో షేర్ రూ.4.42 కోట్లు. ఇది రామ్ సినిమాల్లో హైయెస్ట్ ఓపెనింగ్. సంక్రాంతి వరకు పెద్ద సినిమాలేమీ రావు కాబట్టి.. రెండు వారాల్లో రామ్ దున్నేసుకోవచ్చు. అన్ని వర్గాల ప్రేక్షకులకూ నచ్చే సినిమా కావడంతో ఫుల్ రన్ తో రామ్‌కు బిగ్గెస్ట్ హిట్ గా నిలిచే అవకాశాలున్నాయి.