జైలవకుశలో ఎన్టీఆర్‌ ను తిట్టారా?

Update: 2017-09-26 11:22 GMT
జై లవకుశ మూవీ అంటేనే యంగ్ టైగర్ చేసిన మాయ. స్క్రీన్ ప్లే లోపాలు.. సన్నివేశాలను సరిగా రాసుకోలేకపోవడం వంటి దర్శకుడి తప్పిదాలను కూడా ఎన్టీఆర్ తన నటనా పటిమతో కవర్ చేసి పారేశాడు. మరి అలాంటి సినిమాలో ఎన్టీఆర్ ను తిట్టడమా? అంత ధైర్యం ఎవరికి ఉందని అనుకోవచ్చు.

కానీ ఇక్కడ చెబుతున్నది ఎన్టీఆర్ గురించే కానీ.. నందమూరి తారక రామారావు గురించి కాదు. నందమూరి తారక రత్న.. టాలీవుడ్ జనాలకు బాగా తెలిసిన హీరోనే. ఒకానొక సమయంలో ఒకేసారి 9 సినిమాలను ఆరంభించేసి కెరీర్ మొదలుపెట్టినా.. ఆ తర్వాత జోరు కొనసాగించలేకపోయాడు. ఈ మధ్య విలన్ గా కూడా బాగా సక్సెస్ అవుతుండగా.. ఇప్పుడు జై లవకుశ చిత్రంలో తారకరత్నను ఇన్సల్ట్ చేశారనే వాదన మొదలైంది. ఈ చిత్రంలో కమెడియన్ ప్రియదర్శి పాత్ర ఉంటుంది. ఈ రోల్ పేరు ఓబులేష్ రెడ్డి. రాశి ఖన్నాను పెళ్లి చేసుకోవాలని భావించే బకరా పెళ్లికొడుకు రోల్ ఇది. అయితే.. ఈ రోల్ తో కామెడీ బాగానే పండించారు కానీ.. పేరు దగ్గరే వచ్చింది తంటా.

ఇది తారకరత్న అసలు పేరు అనే సంగతి అందరికీ తెలిసిందే. అందుకనే ఉద్దేశ్యపూర్వకంగా ఈ పేరు పెట్టి తారకరత్నను తిట్టించారన్నది ఓ వాదన. మరీ ఇలా కావాలని బిహేవ్ చేశారని భావించడం కాసింత కష్టమే. ఒక నందమూరి హీరో మరో నందమూరి హీరోను.. ఆన్ స్క్రీన్ పై తిట్టిన సందర్భాలు ఇప్పటివరకూ లేవని గుర్తు చేసుకోవడం బెటర్.
Tags:    

Similar News