హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య తరువాత బాలీవుడ్ లో నెపోటిజం - డ్రగ్ వ్యవహారాలపై హీరోయిన్ కంగనా రనౌత్ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అలాగే సుశాంత్ ది ఆత్మహత్య కాదని.. కోల్డ్ బ్లడెడ్ మర్డర్ అని.. తన ఆరోపణలు నిజంకాదని తేలిన రోజు తన పద్మశ్రీ పురస్కారాన్ని వదులుకుంటానని కంగనా గతంలో ప్రకటించారు. అయితే తాజాగా ఎయిమ్స్ వైద్యుల బృందం సుశాంత్ ది హత్య కాదు.. ఆత్మహత్యనే అని తేల్చింది. అంతేకాకుండా సుశాంత్ సింగ్ కేసులో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న సుశాంత్ ప్రియురాలు రియా చక్రవర్తి కూడా బెయిల్ పై విడుదల అయింది. డ్రగ్స్ కేసులో రియాపై ఆరోపణల్లో బలమైన ఆధారాలు లేవంటూ ముంబై హైకోర్ట్ బెయిల్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో సుశాంత్ కేసులో హత్య కోణాన్ని.. ఇందులో రియా హస్తం ఉందనే ఆరోపణలను కొట్టిపారేస్తున్నారు. దీంతో సోషల్ మీడియాలో కంగనా పై పెద్ద దుమారమే రేగుతోంది.
సుశాంత్ ది ఆత్మహత్యే అని ఎయిమ్స్ ప్రకటించడంతో ట్విట్టర్ వేదికగా కంగనా రనౌత్ పద్మశ్రీ పురస్కారాన్ని వెనక్కి ఇచ్చేయాలని నెటిజన్స్ డిమాండ్ చేస్తున్నారు. #KanganaAwardWaapasKar హ్యాష్ ట్యాగ్ తో నేషనల్ వైడ్ ట్రెండ్ చేస్తూ నిరసన తెలుపుతున్నారు. ఇక దీనిపై హీరోయిన్ స్వర భాస్కర్ ఓ ఛానెల్ లో మాట్లాడుతూ 'సీబీఐ ఎయిమ్స్ సుశాంత్ ది ఆత్మహత్యనే అని స్పష్టం చేశాయి. కొంత మంది ప్రభుత్వం ఇచ్చిన అవార్డులు తిరిగి ఇవ్వబోతున్నారా?' అని సెటైర్ వేసింది. అయితే కంగనా రనౌత్ మాత్రం తన మాటలకు కట్టుబడి ఉంటానని స్పష్టం చేసింది. తాజాగా ఓ నేషనల్ మీడియా ఛానల్ తో మాట్లాడుతూ 'సుశాంత్ కేసు విషయంలో తాను చేసిన ఆరోపణలు తప్పు అయితే నిజంగానే ప్రభుత్వం ఇచ్చిన అవార్డులను తిరిగి ఇస్తాను' అని మరోసారి పేర్కొంది.