ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ `పుష్ప ది రైజ్`. స్టార్ డైరెక్టర్ సుకుమార్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కరించిన ఈ చిత్రం గత ఏడాది డిసెంబర్ లో విడుదలై సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది. మైత్రీ మూవీ మేకర్స్ , ముత్యంశెట్టి మీడియా అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ మూవీ ఉత్తరాదిలో వసూళ్ల వర్ఫం కురిపించి బాలీవుడ్ వర్గాలకు నైట్ మోర్ గా మారిపోయింది. `అల వైకుంఠపురములో` చిత్రంతో ఇండస్ట్రీ హిట్ ని సొంతం చేసుకున్న బన్నీ ఈ మూవీతో పాన్ ఇండియా స్టార్ గా అవతరించాడు.
గతంలో భారీ అంచనాలు పెట్టుకున్న సినిమా ఫ్లాప్ కావడంతో తీవ్ర మనస్థాపానికి గురైన అల్లు అర్జున్ ఈ సారి కొడితే కుంభస్థలాన్నే కొట్టాలని స్ట్రాంగ్ గా ఫిక్సయి చేసిన సినిమా ఇది. తను అనుకున్నట్టుగానే ఎలాంటి ప్రచార ఆర్భాటం లేకుండా ఉత్తరాదిలో విడుదలైన ఈ సినిమా అక్కడ వంద కోట్లకు పై చిలుకు వసూళ్లని రాబట్టి టాక్ ఆఫ్ ది బాలీవుడ్ గా మారింది. దీంతో అక్కడి హీరోలకు కొత్త తలనొప్పులు వచ్చి పడ్డాయి. ఓ ప్రాంతీయ చిత్రం ఎలాంటి ప్రమోషన్స్ లేకుండా 100 కోట్లకు బించి వసూళ్లని రాబట్టడం ఏంటని అంతా అవాక్కయ్యారు.
యాభై శాతం ఆక్యుపెన్సీలో పుష్ప రికార్డుల సునామీని సృష్టించింది. ఇప్పడు అలాంటి పరిస్థితి లేదు. దేశం మొత్తం థియేటర్లన్నీ 100 శాతం ఆక్యుపెన్సీతో రన్నవుతున్నాయి. అంతే కాకుండా ప్రతీ పెద్ద చిత్రానికి నాలుగైతు రోజుల పాటు టికెట్ రేట్లు పెంచుకునే వెసులుబాటుని కల్పించాయి ఉభయ తెలుగు రాష్ట్రాలు. ఈ నేపథ్యంలో `పుష్ప ది రూల్` ఊహకందని స్థాయిలో వసూళ్లని రాబ్టడం ఖాయమంటూ ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ జరుగుతోంది.
హిందీ బెల్ట్ లో సౌత్ సినిమాలు బ్యాక్ టు బ్యాక్ కలెక్షన్ ల వర్షం కురిపిస్తున్న నేపథ్యంలో `పుష్ప -2` పై నెటిజన్ లలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఎలాంటి ప్రచారం, 50 శాతం ఆక్యుపెన్సీ, టికెట్ రేట్లు పెంచుకునే వీలు లేని సమయంలోనే రికార్డు స్థాయిలో వసూళ్లుని రాబడితే ప్రస్తుత పరిస్థితుల్లో ఏ రేంజ్ లో పార్ట్ 2 సాధిస్తుందో అని చర్చనడుస్తోంది. సరైన ప్రమోషన్స్, నార్త్ ని ఊపేసే ఎలిమెంట్స్ స్ట్రాంగ్ గా వుంటే `పుష్ప ది రూల్` పేరుకు తగ్గట్టే ఉత్తరాది బాక్సాఫీస్ ని ఓ రేంజ్ లో రూల్ చేయడం ఖాయమని అంటున్నారు.
తాజాగా కేజీఎఫ్ 2 థియేటర్లలో సందడి చేస్తున్న నేపథ్యంలో `పుష్ప 2` కోసం ఇప్పటి నుంచిఏ అభిమానులు ప్రేక్షకులు ప్రిపేర్ అయిపోతున్నారు. ప్రస్తుతం స్క్రిప్ట్ ఫైనల్ స్టేజ్ లో వున్న `పుష్ప 2` మేలో కానీ, లేదా జూన్ లో కానీ సెట్స్ పైకి వెళ్లబోతోంది. పార్ట్ 1 కు లభించిన క్రేజ్ ని దృష్టిలో పెట్టుకుని ఊహించని విధంగా పార్ట్ 2ని తెరపైకి తీసుకురావాలని బన్నీ, సుకుమార్ ఇప్పటికే ఓ ప్లాన్ ని సిద్ధం చేసుకున్నారని వార్తలు వనిపిస్తున్నాయి. `పుష్ప 2` అనుకున్న విధంగా తెరపైకి వస్తే ఇక థియేటర్లలో రికార్డుల మోతే అని ఫ్యాన్స్ అంటున్నారు.