మెగా బ్రదర్ నాగబాబు అల్లుడు, నిహారిక భర్త చైతన్య జొన్నలగడ్డ - అపార్టుమెంట్ వాసులు మధ్య గొడవ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ వరకూ వెళ్లిన సంగతి తెలిసిందే. రెసిడెన్షియల్ సొసైటీలో ఆఫీస్ ఏర్పాటు చేసుకుని, కోవిడ్ నిబంధనలు పట్టించుకోకుండా ఎక్కువ మంది ఫ్లాట్ కు వస్తుండటం వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని అపార్ట్‌మెంట్ వాసులందరూ బుధవారం అర్ధరాత్రి పోలీసులకు కంప్లైంట్ చేశారు. అదే సమయంలో ఆఫీస్ లోకి అక్రమంగా ప్రవేశించి అపార్ట్‌మెంట్ వాసులు గొడవకు దిగారని.. తమ వ్యక్తిగత జీవితానికి ఇబ్బందులు కలిగిస్తున్నారని చైతన్య సైతం పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఈ కేసులో ఇరువర్గాలు రాజీకి వచ్చి కేసు వెనక్కి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా మెగా అల్లుడు చైతన్య దీనిపై క్లారిటీ ఇస్తూ ఓ వీడియో రిలీజ్ చేసాడు.
చైతన్య మాట్లాడుతూ.. ''ఓనర్ అనుమతితో ప్రొడక్షన్ ఆఫీస్ కోసం ఒక అపార్ట్మెంట్ రెంటుకు తీసుకున్నాం. అయితే ఫ్లాట్ ను కమర్షియల్ పర్పస్ కోసం ఉపయోగిస్తున్నామని అపార్ట్‌మెంట్ అసోసియేషన్ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ విషయం మా దాకా రావడంతో ఆగస్ట్ 10న ఫ్లాట్ ఖాళీ చేయబోతున్నామని ఓనర్ కు చెప్పాము. అయితే ఆగస్టు 2న రాత్రి 8 గంటల సమయంలో 25 నుంచి 30 మంది ఫ్లాట్ లోకి దూసుకెళ్లి గొడవ చేశారు. అప్పుడు నేను ఫ్లాట్ లో లేను కానీ నా స్టాఫ్ దీని గురించి నాకు తెలియజేశారు. స్టాఫ్ తీసిన వీడియో ప్రూఫ్ తో నేను వారిపై పోలీసులకు ఫిర్యాదు చేశాను. ఆ తర్వాత దానికి కౌంటర్ గా నాపై వారు ఫిర్యాదు చేశారు'' అని చెప్పారు.
ఒకరిద్దరు వచ్చి ఉంటే ఇది ఇష్యూ అయ్యేది కాదని.. అంత మంది అనుమతి లేకుండా ఫ్లాట్ లోకి వచ్చి గొడవకు దిగటంతో కంప్లైంట్ చేశానని చైతన్య అన్నారు. ''నేను కంప్లైంట్ చేసిన తర్వాతే వారు నాపై కౌంటర్ కేసు ఫిర్యాదు చేశారు. మీడియాలో వాళ్ళు ముందు ఫిర్యాదు చేసిన తర్వాత నేను చేసాను అని వస్తోంది. అది నిజం కాదు. పోలీసుల ద్వారా ఆ విషయాన్ని అందరూ నిర్ధారించుకోవచ్చు'' అని చెప్పారు. ''ఆ తర్వాత బంజారాహిల్స్ పోలీసులు మా ఇద్దరినీ పిలిచి మాట్లాడారు. వారు నాకు నిహారిక కు క్షమాపణలు చెప్పారు. దీంతో నేను కంప్లైట్ వెనక్కి తీసుకున్నాను. వాళ్ళు కూడా ఫిర్యాదు2వెనక్కి తీసుకున్నారు. నేను ఆగస్ట్ లో ఫ్లాట్ ను ఖాళీ చేసి కమర్షియల్ స్పేస్ కు వెళ్తానని చెప్పాను'' అని చైతన్య చెప్పుకొచ్చారు. వాస్తవాలను ధృవీకరించుకొని రిపోర్టింగ్ చేయాల్సిందిగా మీడియా మిత్రులను కోరుతున్నానని అన్నారు.