ల‌వ్‌ గురించి అడిగితే.. క‌క్క‌లేక మింగ‌లేక‌

Update: 2020-02-15 17:30 GMT
ఫిబ్ర‌వ‌రి 14 ప్రేమికుల రోజు సంద‌ర్భంగా ప్రేమికులంతా ప్రేమ‌సాగరంలో మునిగితేలారు. నిన్న ఉద‌యం నుంచి సెల‌బ్రేష‌న్స్ మొద‌లైపోయాయి. ప్రేమికులంతా త‌మ మ‌న‌సులోని భావాల‌ను ఒక‌రికొక‌రు వ్య‌క్త ప‌రుచుకుంటూ రోజంతా గడిపేసారు. ప్రేమ గురించి ఎవ‌రికి తోచిన విధంగా వారు.. కామెంట్ల‌ రూపంలోనూ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ చేశారు. ఆ సంగ‌తి అటుంచితే యూత్ స్టార్ నితిన్- ర‌ష్మిక జంట‌గా న‌టించిన భీష్మ (21 ఫిబ్ర‌వ‌రి రిలీజ్) ప్ర‌చారంలో గ‌మ్మ‌త్త‌యిన సంగ‌తులే బ‌య‌ట‌ ప‌డ్డాయి. ఓవైపు బ్యాచిల‌ర్ నితిన్ త‌న ప్రేయ‌సి షాలిని ని పెళ్లాడేయ‌బోతున్న సంగ‌తిని ఇంట‌ర్వ్యూల్లో చెబుతుంటే.. ర‌ష్మిక మాత్రం పదే ప‌దే ఎందుక‌నో త‌డ‌బాటుకు గుర‌వుతోంది. అస‌లింత‌కీ ఎందుక‌లా త‌డ‌బ‌డుతోంది? అంటూ అంద‌రికీ సందేహం క‌లుగుతోంది మ‌రి.

షాలిని రెడ్డిని నితిన్ వివాహం చేసుకుని ఏ ఏడాది ఓ ఇంటివాడు అవుతున్నాడు. ఈ సినిమా ప్ర‌చారంలో భాగంగా ప్రియురాలి గురించి ఎన్నో విష‌యాలు మీడియాతో పంచుకున్నాడు. త‌న ల‌వ్ స్టోరీ...ఎలా ప్ర‌పోజ్ చేసాడు అన్ని వివ‌రాల‌ను పూస‌గుచ్చాడు. ఐదేళ్ల లవ్వాయ‌ణం ప‌రిణ‌యంగా మారుతోంది. ఈ సంద‌ర్భంగా నితిన్ ఏ విష‌యాన్ని దాచ‌కుండా అన్నింటిని రివీల్ చేసాడు. అయితే ఇదే చిట్ చాట్ లో పాల్గొన్న ర‌ష్మిక‌కు ల‌వ్ గురించిన ర‌క‌ర‌కాల‌ ప్ర‌శ్న‌లు ఎదుర‌య్యాయి. హోస్ట్.. ర‌ష్మిక ప్రేమ గురించి ఆస‌క్తిక‌ర ప్ర‌శ్న‌లు వేసారు. మీ ప్రేమ గురించి... ఆ రేర్ మూవ్ మెంట్ గురించి ప్రేమికుల రోజు దినోత్స‌వం ప్ర‌త్యేక‌త గురించి ర‌ష్మిక‌ పై ప్ర‌శ్న‌ల ప‌రంపర‌ తో ఉక్కిరి బిక్కిరి చేసేశారు యాంక‌ర్‌. దీంతో ర‌ష్మిక‌ కు గుండె ఆగినంత ప‌నైంది. అడిగిన ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం చెప్పడానికి ఎందుక‌నో బాగా ఇబ్బంది ప‌డింది.

నాలుగేళ్లు ప్రేమ‌ లో ఉన్నాను. అప్పుడు సెల‌బ్రేష‌న్స్ చేసాను. కానీ అదంతా గ‌తం. ఇప్పుడు అలాంటివి ఏమీ లేవు అంటూ... క‌ట్ చేయాల‌ని చూసినా యాంక‌ర్ ప‌దే ప‌దే ర‌ష్మిక ప్ర‌మ‌పై మ‌రింత లోతుగా గుచ్చి గుచ్చి అడిగేస్తుంటే.. ర‌ష్మిక చాలా అసౌక‌ర్యంగా ఫీలైంది. ప్రేమికుల‌రోజు ప్ర‌చారానికి ఎందుకొచ్చానురా బాబూ! అన్న‌ట్టుగానే ఫేస్ ఎక్స్ ప్రెష‌న్ పెట్టింది. అదీ ప్రేమికుల రోజున టైమ్ చూసి ఈ భ‌జ‌నేంటి అన్న‌ట్లు అస‌హ‌నానికి గురైంది. ర‌ష్మిక మంద‌న‌- క‌న్న‌డ స్టార్ ర‌క్షిత్ శెట్టి ప్రేమించుకుని...నిశ్చితార్ధం చేసుకున్న త‌ర్వాత విడిపోయిన సంగ‌తి తెలిసిందే. అందుకే ర‌ష్మికను ఇలా ప్రేమ గురించి అడిగిన‌ప్పుడు స‌తాయించిన‌ట్టుగానే అసౌక‌ర్యం గా ఫీలైంది.
Tags:    

Similar News