‘లై’ - ‘శ్రీనివాస కళ్యాణం’ చిత్రాలతో బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్ లను చవి చూసిన నితిన్ తదుపరి చిత్రం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఇప్పటికే నితిన్ తదుపరి చిత్రం వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కబోతుందని అధికారిక ప్రకటన వచ్చింది. గత రెండు మూడు నెలలుగా ఆ స్క్రిప్ట్ కు మెరుగులు అద్దుతూనే ఉన్నారు. ఎట్టకేలకు స్క్రిప్ట్ సిద్దం అయ్యిందని - వచ్చే నెలలో సినిమాను సెట్స్ పైకి తీసుకు వెళ్లేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లుగా సమాచారం అందుతుంది. ‘భీష్మ’ అనే టైటిల్ ను ఈ చిత్రానికి ఖరారు చేశారు. రష్మికను హీరోయిన్ గా ఎంపిక చేసినట్లుగా కూడా సమాచారం అందుతుంది.
‘ఛలో’ చిత్రం తరహాలో కామెడీ ఎంటర్ టైనర్ గా భీష్మ చిత్రాన్ని వెంకీ కుడుముల చిత్రీకరించేందుకు సిద్దం అవుతున్నాడు. నితిన్ కు ఈ చిత్రంతో సక్సెస్ ఇవ్వాలనే పట్టుదలతో ఆయన ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇదే సమయంలో నితిన్ మరో సినిమాకు కమిట్ అయ్యాడు. ట్యాలెంటెడ్ దర్శకుడిగా పేరు తెచ్చుకుని - విభిన్న చిత్రాలను తెరకెక్కిస్తూ తనకంటూ ఒక బ్రాండ్ ఇమేజ్ ను సొంతం చేసుకున్న దర్శకుడు చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో నితిన్ ఒక చిత్రాన్ని చేయబోతున్నాడట.
‘సాహసం’ - ‘మనమంతా’ చిత్రాల తర్వాత పలు ప్రాజెక్ట్ లు అనుకున్నా కూడా చంద్ర శేఖర్ ఏలేటి వాటిని మొదలు పెట్టడంలో విఫలం అయ్యాడు. కాని తాజాగా నితిన్ తో మూవీ దాదాపుగా ఖరారు అయినట్లే అంటూ సమాచారం అందుతుంది. నితిన్ కోసం చాలా విభిన్నమైన కథాంశంను దర్శకుడు ఏలేటి సిద్దం చేశాడని - వచ్చే సంవత్సరం జనవరి లేదా ఫిబ్రవరిలో సినిమాను పట్టాలెక్కించే అవకాశం ఉందని తెలుస్తోంది. నితిన్ రెండు సినిమాలను కూడా సమాంతరంగా చేసుకుంటూ వెళ్లబోతున్నాడు. ఈ రెండు సినిమాలు వచ్చే ఏడాది సమ్మర్ లో నెల - రెండు నెలల తేడాతో వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. నితిన్ కు ఈ రెండు సక్సెస్ లను తెచ్చి పెడతాయా అనేది చూడాలి.