అక్కినేని జ‌యంతికి ప‌వ‌న్ వ‌స్తాడా?

Update: 2015-09-06 07:37 GMT
అక్కినేని అభిమానులంతా ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్న ఆ త‌రుణం ఇంకెంతో దూరంలో లేదు. టాలీవుడ్‌ ని ఏల‌డానికి మ‌రో స్టార్ హీరో వ‌స్తున్నాడు అన్న కాన్ఫిడెన్స్‌ తో తెలుగు ప్రేక్ష‌కులంతా ఉన్నారు. అక్కినేని అఖిల్ న‌టించిన అఖిల్ చిత్రం ఎట్టి ప‌రిస్థితుల్లో ద‌స‌రా బ‌రిలో రిలీజ‌వుతుంద‌నే చెబుతున్నారు. అయితే అంత‌కంటే ముందు ఈనెల 20న మ‌హాన‌టుడు అక్కినేని నాగేశ్వ‌ర‌రావు జ‌యంతి సంద‌ర్భంగా ఆడియో వేడుక‌ను ఘ‌నంగా నిర్వ‌హించాల‌ని నితిన్ భావిస్తున్నాడు.

ఇది నిర్మాత‌గా నితిన్‌ కి, అటు అక్కినేని ఫ్యామిలీకి ఎంతో కీల‌క‌మైన సంద‌ర్భం. అందుకే ఈ ఆడియో వేడుక‌లో ముఖ్య అతిధులుగా దిగ్గ‌జాలంటి సెల‌బ్రిటీల్ని ఆహ్వానిస్తున్నారు. అందులో ప‌వ‌ర్‌ స్టార్ ప‌వ‌న్‌ క‌ల్యాణ్ పేరు కూడా ఉంది. ప‌వ‌న్‌ ని నితిన్‌, నాగార్జున స్వ‌యంగా ఆహ్వానించ‌నున్నార‌ని తెలుస్తోంది. అయితే ప‌వ‌న్ ఈ ఆడియోకి వ‌స్తాడా? అన్న‌ది ఆస‌క్తి క‌ర చ‌ర్చ‌గా మారింది. మెగా హీరోల ఆడియోల‌కు రాని ప‌వ‌న్ ఇలా వేరొక ఆడియోకి వ‌స్తాడా? అన్న చ‌ర్చ సాగుతోంది.

అక్కినేని జ‌యంతి రోజున ఆడియో లాంచ్ చేయ‌డాన్ని అక్కినేని ఫ్యామిలీ ఎంతో ప్ర‌తిష్ఠాత్మ‌కంగా భావిస్తోంది. అఖిల్‌ ని స్టార్‌ గా ఆవిష్క‌రించి ఏఎన్నార్ క‌ల‌ను నిజం చేయాల‌న్న‌దే ప‌ట్టుద‌ల‌. అందుకే క‌చ్ఛితంగా ప‌వ‌న్‌ ని ఆడియోకి తీసుకురావాల‌న్న ప‌ట్టుద‌లలో నితిన్ ఉన్నాడ‌ని చెబుతున్నారు. ప‌వ‌న్ రాక‌తో ఆడియోకి ప్ర‌త్యేక క‌ళ వ‌స్తుంద‌ని భావిస్తున్నారంతా. గురుడు ఏం చేస్తాడో చూడాలి.
Tags:    

Similar News