కొరియర్ బాయ్ కళ్యాణ్ సినిమా చేయకూడదు అనుకుని.. ఏమాత్రం ఆసక్తి లేకుండానే ఆ కథ విన్నానని.. కానీ కథ విన్నాక మరో ఆలోచన లేకుండా సినిమా చేశానని నితిన్ చెప్పాడు. ఇలాంటి పాయింట్ తో ఇండియన్ సినిమా మీద సినిమా రాలేదని నితిన్ అన్నాడు. ఈ సినిమా ఆలస్యం కావడానికి చాలా కారణాలున్నాయని.. కానీ ఎంత ఆలస్యమైనా సినిమా మాత్రం అద్భుతంగా వచ్చిందని చెప్పాడు.
కొరియర్ బాయ్ కళ్యాణ్ ఆడియో ఫంక్షన్ లో నితిన్ మాట్లాడుతూ.. ‘‘ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతుండటంతో ‘హమ్మయ్యా’ అనిపిస్తోంది. ఇది ఇంత ఆలస్యం కావడానికి చాలా కారణాలున్నాయి. నాకు తెలిసి ప్రతి హీరోకు, ప్రతి దర్శకుడికి, ప్రతి నిర్మాతకు కెరీర్ లో ఓ లీన్ ఫేజ్ వస్తుంది. నాకు ఇష్క్ ముందు అలాంటి దశ వచ్చింది. గౌతమ్ గారు ఈ సినిమా విషయంలో ఆ ఫేజ్ ఎదుర్కొన్నారు. ఇష్క్ తర్వాత నేను చాలా కథలు విన్నాను. అవేవీ బాగా లేదు. అలాంటి సమయంలో గౌతమ్ ఫోన్ చేసి కొరియర్ బాయ్ కళ్యాణ్ కథ వినమన్నారు. నేను చాలా రిలక్టంట్ గా, ఈ సినిమా చేయకూడదు అనుకుంటూనే కథ విన్నాను. కానీ వినగానే ఇన్ స్టంట్ గా నచ్చేసింది. ఐతే సినిమా అనుకోని కారణాల వల్ల ఆలస్యమైంది. ఐతే ఆ సమయంలో నేను ఎక్కడికి వెళ్లినా కొరియర్ బాయ్ కళ్యాణ్ ఎప్పుడు అని అడగడం మొదలుపెట్టారు. కానీ నాకే తెలియని సంగతి నేనెలా చెప్పగలను.
చాలామంది సినిమాను మాకిచ్చేయండి.. మేం రిలీజ్ చేసేస్తాం అని అడిగారు. కానీ గౌతమ్ ఒప్పుకోలేదు. మామూలుగా సినిమా డిలే అయినపుడు నిర్మాతలు రాజీ పడిపోతారు. కానీ గౌతమ్ మాత్రం అలా చేయలేదు. ముందు ఎలా అనుకున్నారో అలాగే పూర్తి చేయించారు. ఇది డిఫరెంట్ పాయింట్ తో తెరకెక్కిన సినిమా. రొటీన్ గా ఉండదు. ఇండియన్ స్క్రీన్ లో ఇలాంటి పాయింట్ తో సినిమా రాలేదని నమ్మకంగా చెబుతున్నా. ఈ సినిమాకు హీరో నేను కానీ.. నిజమైన హీరోలు గౌతమ్ మీనన్, ప్రేమ్ సాయి. ప్రేమ్ సాయి సీరియల్ నటుడిగా మెగా స్టార్. కానీ మంచి లైఫ్ వదులుకుని డైరెక్షన్ లోకి వచ్చాడు. తొలి సినిమాతో ఏ డైరెక్టర్ పడకూడని బాధ పడ్డాడు. ఒక అనుభవజ్నుడైన డైరెక్టర్ లా సినిమా తీశాడు’’ అని నితిన్ ముగించాడు.