ఈమధ్య కాలంలో హిట్ అయిన ప్రతి సినిమాకు ఒక కామన్ పాయింట్ ఉంది. అదేంటంటే ప్రీ-రిలీజ్ బజ్. అది పాజిటివ్ కావొచ్చు.. నెగెటివ్ కావచ్చు..లేక వివాదాల హంగామా అయి ఉండొచ్చు. బజ్ లేకుండా సైలెంట్ గా వచ్చి స్లీపర్ హిట్ అయిన సినిమాలు దాదాపుగా ఈమధ్య కనబడడం లేదు. మరి కోన వెంకట్ నిర్మాణంలో తెరకెక్కిన ఆది పినిసెట్టి తాజా చిత్రం 'నీవెవరో' కు ప్రీ రిలీజ్ బజ్ ఏమాత్రం కనిపించడం లేదు.
ఈ సినిమా మరో నాలుగు రోజుల్లో ఆగస్ట్ 24 న విడుదలకు సిద్ధం అవుతోంది. ఇప్పుడు టాలీవుడ్ అంతా 'గీత గోవిందం' హంగామానే. ఎక్కడ చూసినా విజయ్ దేవరకొండ టాపిక్కే. 'గీత గోవిందం' ఊపు చూస్తుంటే ఇప్పుడప్పుడే చల్లబడేలా లేదు. ఇలాంటి పరిస్థితుల్లో పెద్దగా హైప్ లేని 'నీవెవరో' ను పట్టించుకుంటారా అనేది సందేహమే. పైగా అది సినిమాకు ప్రమోషన్స్ కూడా కాస్త డల్ గానే ఉన్నాయి. రైటర్ టర్న్డ్ ప్రొడ్యూసర్ కోన వెంకట్ ఈ సినిమాకు కాంబినేషన్ అయితే మంచిదే సెట్ చేశాడు.. 'రంగస్థలం' తో ఆదికి మంచి గుర్తింపే వచ్చింది. తాప్సీ కి కూడా మంచి గుర్తింపే ఉంది. పైగా 'గురు' హీరోయిన్ రితికా సింగ్ కూడా హీరోయిన్. అయినా ఎందుకో కోన సారు ఊహించినట్టుగా హైప్ రాలేదు.
మరి ఈ పరిస్థితిలో సినిమాకు గట్టిగా ప్రమోషన్స్ చేయడం ముఖ్యం. ఆ దిశగా ఆలోచించకపోతే గోవిందం గాలివానలో పడి ఈ సినిమా కొట్టుకుపోతుందని ఇండస్ట్రీ ఇన్ సైడర్స్ ఒపెన్ గానే కామెంట్ చేస్తున్నారు.