పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కంబ్యాక్ మూవీ 'వకీల్ సాబ్' మరో రెండు రోజుల్లో ఏప్రిల్ 9న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. పవన్ ని మూడేళ్ళ తర్వాత వెండితెరపై చూడటానికి అభిమానులు కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఊహించని స్థాయిలో ఈ సినిమాకి అడ్వాన్స్ బుకింగ్స్ జరుగుతున్నాయని తెలుస్తోంది. ఇదిలావుండగా 'వకీల్ సాబ్' సెకండాఫ్ లో ఓ సర్ప్రైజ్ ఉంటుందని చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది. అది ఏమైవుంటుందా అని ఫ్యాన్స్ రోజురోజుకూ అంచనాలు పెంచుకుంటూ వచ్చారు. ఈ క్రమంలో పవన్ కల్యాణ్ కుమారుడు అఖిరా నందన్ ఇందులో గెస్ట్ అప్పీరియెన్స్ ఇవ్వబోతున్నాడని.. ఇదే సర్‌ప్రైజ్ అని ఓ వార్త చక్కర్లు కొట్టింది. ఈ నేపథ్యంలో తాజాగా డైరెక్టర్ శ్రీరామ్ వేణు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆ సర్ప్రైజ్ గురించి ఎక్కువగా ఊహించుకోవద్దని.. ఇందులో ఎలాంటి ట్విస్టులు, గెస్ట్ అప్పీయరెన్సులు లేవని తెలిపారు.
వేణు శ్రీరామ్ మాట్లాడుతూ.. "సర్ప్రైజ్ అంటే మీడియాలో దీన్ని ఓ రేంజ్ లో బ్లో అప్ చేస్తారనే భయం ఉంది. అందుకే ప్రీ రిలీజ్ ఈవెంట్ లోనే చెప్పాలని చూస్తే ఫ్యాన్స్ చెప్పొద్దూ చెప్పొద్దు అని అరిచారు. ఇందులో ఎలాంటి గెస్ట్ అప్పీయరెన్స్ లు లేవు. వేరే ఆర్టిస్టులు ఎవ్వరూ కనిపించరు. ఇది సినిమాలో మ్యూజిక్ పరంగా ఓ చిన్న సర్ప్రైజింగ్ ఎలిమెంట్ అంతే. అసలు ఇది కథలో ట్విస్ట్ కాదు. ఆడియన్స్ అబ్బా అని ఫీల్ అయ్యేది కాదు. దయచేసి మీరు అనవసరంగా ఎక్కువ ఊహించుకోకండి" అని చెప్పుకొచ్చారు. సెకండాఫ్ లో ఓ సర్ప్రైజ్ ఎలిమెంట్ అంటూ ఎక్సపెక్టేషన్స్ పెంచుకుంటున్న నేపథ్యంలో వేణు శ్రీరామ్ వాటిని తగ్గించే ప్రయత్నం చేశాడని అర్థం అవుతోంది. కాగా, 'ఓ మై ఫ్రెండ్' సినిమాతో దర్శకుడిగా పరిచయమైన వేణు శ్రీరామ్ కు 'వకీల్ సాబ్' మూడో సినిమా. మధ్యలో నానితో 'ఎంసీఏ' సినిమా తీసి సక్సెస్ అందుకున్నాడు. ఇదే క్రమంలో అల్లు అర్జున్ తో 'ఐకాన్' అనే ప్రాజెక్ట్ అనౌన్స్ చేసాడు కానీ.. ఎందుకో అది పట్టాలెక్కలేదు. ఇప్పుడు 'వకీల్ సాబ్' తో సూపర్ హిట్ కొట్టి క్రేజీ డైరెక్టర్ గా మారుతాడేమో చూడాలి.