జూనియర్ ఎన్టీఆర్ RRR సినిమా సక్సెస్ అనంతరం కొరటాల శివ దర్శకత్వంలో తన 31వ సినిమాను మరికొన్ని రోజుల్లో స్టార్ట్ చేయబోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ మొదలు కావాల్సి ఉంది. కానీ స్క్రిప్టు విషయంలో ఎన్టీఆర్ కొన్ని మార్పులు చేయాలని అడగడంతో కొరటాల శివ మరో సారి ఈ కథను మరింత బలంగా మారుస్తున్నట్లు తెలుస్తోంది.
ఎన్టీఆర్ అయితే తన తదుపరి సినిమాల విషయంలో స్క్రిప్ట్ మొత్తం కాన్ఫిడెంట్ గా కనిపించిన తర్వాతనే రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టాలి అని ఒక బలమైన నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. ఇక కొరటాల శివ సినిమా తరువాత ఎన్టీఆర్ తన 31 సినిమాను ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో చేయబోతున్న విషయం తెలిసిందే. కేజిఎఫ్ సినిమాలతో పాన్ ఇండియా మార్కెట్ లో అగ్ర దర్శకులలో ఒకరిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ అందుకున్న ప్రశాంత్ ప్రస్తుతం ప్రభాస్ తో మరొక యాక్షన్ సినిమాను పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నాడు.
సలార్ అనే ఆ యాక్షన్ అడ్వెంచర్ మూవీనీ ఏడాది చివరి లోపు పూర్తి చేసి ఎన్టీఆర్ సినిమాను వచ్చే ఏడాది మొదట్లోనే స్టార్ట్ చేయాలని అనుకుంటున్నాడు. ఇక ఈ ప్రాజెక్టు కోసం ప్రశాంత్ నీల్ టైటిల్ విషయంలో కూడా ఒక నిర్ణయానికి వచ్చే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. సాధారణంగా ప్రశాంత్ నీల్ ఎలాంటి సినిమాను మొదలు పెట్టిన కూడా ముందుగా టైటిల్ తోనే పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేస్తూ ఉంటాడు. అలాగే ఎన్టీఆర్ 31వ సినిమాకు కూడా ముందుగానే టైటిల్ ఫిక్స్ చేసే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.
ప్రస్తుతం వినిపిస్తున్న టాక్ ప్రకారం NTR 31 సినిమాకు అసుర అనే టైటిల్ అనుకుంటున్నట్లు తెలుస్తోంది. అలాగే అసురుడు అని కూడా చేంజ్ చేయాలని అనుకుంటున్నట్లు చర్చలు జరుగుతున్నాయట. అయితే టైటిల్ విషయంలో ఇంకా ఎలాంటి ఫైనల్ డెసిషన్ తీసుకోలేదు. టైటిల్ పై మరొకసారి చిత్ర యూనిట్ సభ్యులు అందరూ కలిసి చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరి ఇది ఎంతవరకూ నిజం అవుతుందో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.