ఈ మధ్య టాలీవుడ్ హీరోలు.. దర్శకులు ఒక్కొక్కరుగా రివ్యూలు.. రివ్యూ రైటర్ల మీద విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిదే. కొన్ని నెలల కిందటే ‘దువ్వాడ జగన్నాథం’ టీం సభ్యులు సినీ సమీక్షకుల్ని లక్ష్యంగా చేసుకున్నారు. ఓవైపు హీరో అల్లు అర్జున్.. మరోవైపు దర్శకుడు హరీష్ శంకర్ రివ్యూ రైటర్లపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఐతే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ కూడా సమీక్షకులపై అసహనం వ్యక్తం చేశాడు. ఐతే అతను తీవ్ర వ్యాఖ్యలేమీ చేయలేదు కానీ.. కొంచెం ఆవేదనగా మాట్లాడాడు. సినీ విశ్లేషకులు కొంచెం ఆచితూచి వ్యవహరించాలని ఎన్టీఆర్ హితవు పలికాడు. ఈ క్రమంలో ముందుగా అతను ఓ ఆసక్తికర పోలిక తీసుకొచ్చాడు.
సినిమా అనేది ఎమర్జెన్సీలో చావు బతుకుల మధ్య ఆసుపత్రికి వచ్చిన పేషెంట్ లాంటిదని.. ప్రేక్షకులు డాక్టర్లని.. తాము ఆ పేషెంట్ కుటుంబ సభ్యులు, బంధువుల్లాంటి వాళ్లమని అన్నాడు ఎన్టీఆర్. ఐతే డాక్టర్లు కొంచెం పేషెంట్ పరిస్థితి చూసి బతుకుతాడో లేదో చెప్పే లోపే.. ఆసుపత్రిలో అటుగా పోతున్న దారిన పోయే దానయ్యలు బతకడం కష్టమని తేల్చేస్తున్నారని.. తేలిగ్గా మాట్లాడేస్తున్నారని.. కామెంట్లు చేస్తున్నారని.. కొంతమంది విశ్లేషకులు ఈ కోవలోకే వస్తారని ఎన్టీఆర్ అన్నాడు. డాక్టర్లు పేషెంట్ పరిస్థితి చూసి చచ్చిపోయాడు అని తీర్మానించినట్లుగా.. సినిమా బాలేదని ప్రేక్షకులు నిర్ణయిస్తే తమకు అభ్యంతరం లేదని.. అంగీకరిస్తామని.. కానీ ఈలోపే సినిమా పోయిందని విశ్లేషకులు తీర్మానించడం కరెక్ట్ కాదని అన్నాడు ఎన్టీఆర్. ఒక మాట బయటికి వస్తే దాని ప్రభావం ఎంత ఉంటుందో ఆలోచించుకుని సినిమాలపై కామెంట్లు చేయాలని అతను హితవు పలికాడు.
సినిమా రిలీజైన మూడు రోజుల వరకు సమీక్షలు ఆపాలని అతను కోరాడు. తాను ఎవరినీ బాధ పెట్టడానికి ఇలా అనడం లేదని.. కొంతమంది గురించే అంటున్నానని.. నిజానికి చావు బతుకుల మధ్య వచ్చిన పేషెంటులా వచ్చిన తమ సినిమా ‘జై లవకుశ’ను డాక్టర్లు అనదగ్గ ప్రేక్షకులు బాగా ఆదరించారని.. తమ సినిమా చాలా బాగా ఆడుతోందని అన్నాడు ఎన్టీఆర్. ప్రజాస్వామ్య దేశంలో తమ అభిప్రాయం చెప్పే హక్కు అందరికీ ఉందని.. కానీ కొంచెం ఆచితూచి వ్యవహరించాలని అంటూ.. తమ సినిమాకు మద్దతుగా నిలిచిన మీడియాకు పాదాభివందనం చేస్తున్నానని ఎన్టీఆర్ చెప్పడం విశేషం.