ఎన్టీఆర్ బయోపిక్ రెండవ భాగం 'ఎన్టీఆర్ మహానాయకుడు' నిన్న శుక్రవారం నాడు రిలీజ్ అయింది. అందరూ అంచనా వేసినట్టుగానే ఈ సినిమాకు ఆడియన్స్ రెస్పాన్స్ చాలా వీక్ గా ఉంది. మొదటి రోజు ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో రూ. 1.57 కోట్ల రూపాయల షేర్ తోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. బాలయ్య కెరీర్ లో ఇది అత్యంత తక్కువ ఓపెనింగ్స్ సాధించిన సినిమా అయింది. బాలకృష్ణ కెరీర్లో పెద్ద ఫ్లాపయిన 'పరమవీరచక్ర' కంటే ఈ సినిమా ఫస్ట్ డే కలెక్షన్స్ తక్కువగా ఉన్నాయి.
టాలీవుడ్ సీనియర్ స్టార్లలో ఒకరైన బాలయ్యకు సాలిడ్ ఫ్యాన్ బేస్ ఉంది. అయినా ఈ రేంజ్ కలెక్షన్స్ షాక్ ఇచ్చేవే. 'మహానాయకుడు' సినిమా కలెక్షన్స్ లో 40% షేర్ మొదటి భాగం వల్ల నష్టపోయిన బయ్యర్లకు ఇస్తామని నిర్మాతలు హామీ ఇచ్చినట్టు వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఈ కలెక్షన్స్ ట్రెండ్ చూస్తుంటే మొదటి భాగం వల్ల నష్టపోయిన బయ్యర్లకు నష్టపరిహారం నామమాత్రంగా అయినా దక్కేలా లేదు. ఈ చిత్రానికి అడ్వాన్సు బుకింగ్ ట్రెండ్స్ కూడా ఆశాజనకంగా లేవు. ఈ సినిమా బాలయ్య కెరీర్లో మరో కమర్షియల్ డిజాస్టర్ దిశగా పయనించడం ఖాయమేనని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో ఏరియా వైజ్ కలెక్షన్స్ ఇలా ఉన్నాయి.
నైజామ్: 0.36 cr
సీడెడ్: 0.19 cr
ఉత్తరాంధ్ర: 0.13 cr
కృష్ణ: 0.14 cr
గుంటూరు: 0.50 cr
ఈస్ట్ : 0.08 cr
వెస్ట్: 0.10 cr
నెల్లూరు: 0.07 cr
ఎపీ + తెలంగాణా టోటల్: రూ. 1.57 cr