సౌత్ ఇండియా సినిమా రేంజ్‌ను పెంచిన వారిలో కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ ఒకరు. చాలా కాలం క్రితమే డైరెక్టర్‌గా ప్రయాణాన్ని ప్రారంభించిన అతడు.. కేజీఎఫ్ సిరీస్‌తో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందాడు. అలాగే పాన్ ఇండియా స్థాయిలో గొప్ప దర్శకుడిగా కితాబ్ అందుకున్నాడు. దీంతో రెట్టించిన ఉత్సాహంతో వరుసగా ఫ్యూచర్ ప్రాజెక్టులను లైన్లో పెట్టుకుంటున్నాడు.
ప్రస్తుతం ప్రశాంత్ నీల్.. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌తో కలిసి 'సలార్' అనే సినిమాను చేస్తున్నాడు. ఇప్పటికే దీనికి సంబంధించిన చాలా వరకు షూటింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. త్వరలోనే మిగిలిన అన్ని పనులను కంప్లీట్ చేసి.. ఈ సినిమాకు గుమ్మడికాయ కొట్టబోతున్నాడు. ఇది పూర్తయిన వెంటనే ప్రశాంత్ నీల్.. జూనియర్ ఎన్టీఆర్‌తో సినిమాను స్టార్ట్ చేస్తాడు.
చాలా రోజుల క్రితమే ఎన్టీఆర్‌తో తన ప్రాజెక్టు ఉంటుందని ప్రశాంత్ నీల్ ప్రకటించాడు. అయితే మధ్యలో కొన్ని అనుకోని అవాంతరాల వల్ల ఈ సినిమా ఆలస్యం అయింది. దీనికి తోడు ఎన్టీఆర్ తన తదుపరి చిత్రంగా 'వార్ 2' చేస్తాడని అన్నారు. దీంతో ప్రశాంత్ నీల్ కాంబోలో మూవీ ఉంటుందా? ఉండదా? అని చాలా మంది అనుకున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో అధికారిక అప్డేట్ వచ్చింది.
ఈరోజు ప్రశాంత్ నీల్ (జూన్ 4వ తేదీ) తన పుట్టినరోజును జరుపుకుంటున్నాడు. దీని పురస్కరించుకొని ఎన్టీఆర్ 31 మూవీని నిర్మిస్తున్న మైత్రి మూవీ మేకర్స్, నందమూరి తారకరామారావు ఆర్ట్స్ బ్యానర్లు ప్రశాంత్ నీల్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ పోస్టర్లను రిలీజ్ చేశాయి. దీంతో వీళ్లిద్దరి కాంబినేషన్‌లో మూవీ త్వరలోనే రాబోతుందని స్పష్టం చేసినట్లు అయింది.
ఇదిలా ఉండగా.. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ తర్కెక్కించే సినిమాపై ఆరంభం నుంచి అంచనాలు భారీగా ఉన్నాయి అందుకు అనుగుణంగానే దీన్ని హై ఓల్టేజ్ యాక్షన్‌తో తీస్తారని అంటున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. ఇక, ఈ మూవీతో తారక్ ఇండస్ట్రీ హిట్ కొట్టడం ఖాయమని ఫ్యాన్స్ అనుకుంటున్నారు.