అలా అయితే నా అభిమానులుగా ఉండొద్దు

Update: 2016-08-28 10:23 GMT
తన అభిమానులెవరూ హద్దులు దాటుతారని తాను భావించట్లేదని.. అలా హద్దులు దాటే అభిమానం తనకు వద్దని ఎన్టీఆర్ స్పష్టం చేశాడు. ముందు దేశం.. ఆ తర్వాత కన్నవాళ్లు.. భార్యా పిల్లలు.. శ్రేయోభిలాషులు అని.. వాళ్లందరి తర్వాతే అభిమాన నటుడి గురించి ఆలోచించాలని ఎన్టీఆర్ చెప్పాడు. ఇటీవల అభిమానుల మధ్య గొడవలో వినోద్ రాయల్ అనే పవన్ కళ్యాణ్ ఫ్యాన్ హత్యకు గురైన నేపథ్యంలో ఎన్టీఆర్ ఓ టీవీ ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశాడు.

 ‘‘నేను అభిమానులందరికీ చెప్పేదొకటే.. మితిమీరిన అభిమానం వద్దు. అలాంటి అభిమానం చూపించాలంటే చూపించండి. ముందుగా నువ్వు పుట్టిన దేశం.. ఆ తర్వాత కన్న తల్లిదండ్రులు.. ఆపై భార్య పిల్లలు.. మిమ్మల్ని ప్రేమించే శ్రేయోభిలాషులు.. వీళ్ల మీద అభిమానం చూపించండి. ఆ తరువాత అభిమాన నటుడిని ప్రేమించండి. క్రాస్ రోడ్స్ లోకి వచ్చి ఎవరిని ఎంచుకోవాలి అంటే.. ముందు దేశం.. ఆ తర్వాత తల్లిదండ్రులు.. భార్యాపిల్లలు.. శ్రేయోభిలాషులు.. అభిమాన నటుడు చివరనే ఉంటాడు. నా అభిమానులకే కాదు.. అందరు హీరోల అభిమానులకూ నేను ఇచ్చే సందేశం ఇదే. మా హీరోలందరం ఐక్యంగానే ఉంటాం. మా మధ్య గొడవలకు సంబంధించిన ఎన్ని సంఘటనలున్నాయో చెప్పండి. మరి అభిమానుల్లో ఎందుకీ గొడవలు. అభిమానం సినిమా వరకే ఉంచండి. రెండు గంటల సినిమా విషయంలో ప్రాణాలు తీసుకునేలా గొడవలు అవసరం లేదు. నా అభిమానులెవరూ ఇలా మితిమీరి ప్రవర్తిస్తారని అనుకోను. అలా ప్రవర్తించేవాళ్లు ఎవరైనా ఉంటే నా అభిమానులుగా ఉండొద్దు’’ అని ఎన్టీఆర్ స్పష్టం చేశాడు.
Tags:    

Similar News