భారతీయ సినిమా చరిత్రలోనే ఆదిపురుష్ 3డి మరో సంచలనం కాబోతోందా? ప్రస్తుతం ప్రభాస్ -ఓంరౌత్ - టీసిరీస్ బృందం చేస్తున్న ప్రయత్నం చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. బడ్జెట్ సహా ఎందులోనూ తగ్గడం లేదు. హిందీ-తెలుగు ద్విభాషా అప్పియరెన్స్ కోసం ఇరు పరిశ్రమలకు చెందిన నటీనటుల్ని ఎంపిక చేసుకోనున్నారు. ఇప్పటికే సీత పాత్రలో కీర్తి సురేష్ పేరు వినిపిస్తోంది. సైఫ్ ఖాన్ రావణుడిగా ఫిక్సయ్యాడు.
ఇక ఈ సినిమా కోసం ఏకంగా 400-500 కోట్ల బడ్జెట్ ని వెచ్చిస్తారట. అందులో దాదాపు 250 కోట్లు కేవలం వీఎఫ్.ఎక్స్ సహా గ్రాఫిక్స్ వర్క్ కోసమే ఖర్చు చేస్తారని ప్రచారమవుతోంది. 2.0 కోసం శంకర్ ఖర్చు చేసినట్టే ఎక్కడా రాజీకి రాకుండా ఈ మూవీకి బడ్జెట్లు భారీగా వెచ్చిస్తున్నారని తెలిసింది. అలాగే గ్రాఫిక్స్ రేంజ్ అవతార్ లెవల్లో ఉంటుందన్న ప్రచారం కూడా సాగిపోతోంది. ఇక ఇది 3డి విజువల్ ఫీస్ట్ గా ఉండాలనేది డార్లింగ్ ప్రభాస్ పంతం కావడంతో ఎంతో కేర్ తీసుకుంటున్నారట.
రామాయణ కథను ఎంచుకుని అందులో మెలూహా తరహా క్యారెక్టరైజేషన్ ని మిక్స్ చేసి ఓం రౌత్ భారీ ప్రయోగమే చేయబోతున్నాడు. అందుకే తొలిగా వీఎఫ్.ఎక్స్ - గ్రాఫిక్స్ పనులకు అడ్డు లేకుండా అవసరమయ్యే షాట్స్ ని ముందుగా డిజైన్ చేసుకుని వాటినే తొలిగా చిత్రీకరించనున్నాడట. వాటితో మొదలు పెట్టి తర్వాత ఇతర సన్నివేశాల్ని తెరకెక్కించేలా షెడ్యూల్స్ ని ప్లాన్ చేస్తున్నారట. 2021 జనవరిలో సెట్స్ కెళ్లే వీలుంది. ఇండోర్ లో షాట్స్ తొలిగా తీసి ఆ తర్వాత అవుట్ డోర్ షూట్ తో మొదలు పెట్టనున్నారని తెలుస్తుంది. దాదాపు ఐదు భాషల్లో 3డిలో రిలీజ్ చేయడం ద్వారా బాక్సాఫీస్ సంచలనాలకు ఆస్కారం ఉంటుందని టీమ్ ఆలోచిస్తోందట.