మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంపిటీషనల్ వరల్డ్ లో పక్కా ప్లానింగ్ తో ముందుకెళ్తున్నారు. పాన్ ఇండియా డైరెక్టర్లను ఎంపిక చేస్తూ తెలివిగా ముందుకు దూసుకెళుతున్నాడు. ప్రస్తుతం చరణ్ దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న `ఆర్.ఆర్.ఆర్`లో నటిస్తున్నాడు. ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ లో ఉంది. జనవరి 7న సినిమా రిలీజ్ అవుతుంది. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. సక్సెస్ అయితే చరణ్ పాన్ ఇండియా స్టార్ గా వెలిగిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక ఈ సినిమా షూటింగ్ ఇలా పూర్తిచేసాడా లేదో! వెంటనే దేశం గర్వించదగ్గ దర్శకుడు శంకర్ ప్రాజెక్ట్ లో నటించే అవకాశం దక్కింది.
ప్రస్తుతం శంకర్ తో కలిసి ఓ పొలిటికల్ థ్రిల్లర్ సినిమా చేస్తున్నాడు. `ఒకే ఒక్కడు`..`భారతీయుడు` రేంజ్ కంటెంట్ తో సమకాలిన రాజకీయాలు బేస్ చేసుకుని తెరకెక్కిస్తోన్న చిత్రంగా మీడియాలో హైలైట్ అవుతోంది. ఈ సినిమాపై అంచనాలు అంతకంతకు పెరిగుతున్నాయి. శంకర్ బ్రాండ్ తోనే పాన్ ఇండియా రేంజులో గుర్తింపు దక్కింది. సినిమా ఎప్పుడు పూర్తవుతుంది? ఎప్పుడు రిలీజ్ అవుతుంది? అన్న వివరాలు ఇంకా బయటకు రాలేదు. ఇంతలోనే మరో పాన్ ఇండియా స్టార్ మేకర్ కేజీఎఫ్ ఫేం ప్రశాంత్ నీల్ తోనూ చరణ్ కమిట్ మెంట్ గురించి చర్చ సాగుతోంది. ఈ జోడీ యూనివర్శల్ అప్పీల్ తెచ్చేలా ఓ ప్రాజెక్ట్ చేయడానికి ఒప్పందాలు జరిగినట్లు ఇప్పటికే ప్రచారం ఉంది.
ఆ ప్రాజెక్ట్ ఎప్పుడు సెట్స్ పైకి వెళుతుంది అన్నది మాత్రం క్లారిటీ లేదు. అలాగే `జెర్సీ` దర్శకుడు గౌతమ్ తిన్ననూరితోనూ ఓ చిత్రం చేయాల్సి ఉంది. ఇప్పటికే స్క్రిప్ట్ కూడా లాక్ అయింది. చరణ్- శంకర్ తో చేస్తోన్న సినిమా షూటింగ్ కి గనుక బ్రేక్ పడితే గౌతమ్ ప్రాజెక్ట్ పట్టాలెక్కే అవకాశం ఉంది. గౌతమ్ కాన్సెప్ట్ లకు పాన్ ఇండియా అప్పీల్ ఉంటుందని `జెర్సీ`తోనే ప్రూవ్ చేసిన సంగతి తెలిసిందే. పైగా అతడు షాహిద్ తో జెర్సీ రీమేక్ చేస్తూ బాలీవుడ్ లోనూ పాపులరవుతున్నాడు. అది అతడిని పాన్ ఇండియా డైరెక్టర్ గా మలిచే వీలుంది. ఇలా చరణ్ బ్యాక్ టు బ్యాక్ పాన్ ఇండియా ఫిలింమేకర్స్ ని రంగంలోకి దించి సినిమాలు చేయడం విశేషం.