టీజర్ టాక్: హూ ఈజ్ ది గోల్డ్ ఫిష్?

Update: 2019-03-04 05:36 GMT
ఆది..సాషా ఛత్రి..పార్వతీశం..మనోజ్ నందం.. నిత్య నరేష్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'ఆపరేషన్ గోల్డ్ ఫిష్'.  'వినాయకుడు' ఫేమ్ సాయికిరణ్ అడివి ఈ సినిమాకు దర్శకుడు.  కాశ్మీర్ తీవ్రవాదం నేపథ్యంలో తెరకెక్కిన సినిమా ఇది.  ఈ సినిమా టీజర్ ను కొద్దిసేపటి క్రితమే విడుదల చేశారు.  ఒకటిన్నర నిముషంకంటే తక్కువ నిడివి ఉన్న టీజర్లో సినిమా కథాంశాన్ని రివీల్ చేశారు.

ఆడుతూ పాడుతూ సరదాగా గడిపేస్తున్న నలుగురు ఫ్రెండ్స్ గ్యాంగ్ లో ఒకరికి కాశ్మీర్ తీవ్రవాదుల నుండి ముప్పు ఏర్పడుతుంది.  ఈ సమస్యను కమాండో అర్జున్ (ఆది) పరిష్కరించేందుకు చేసిన ప్రయత్నాలు.. అందులో ఆదికి ఎదురైన సంఘటనల సమాహారమే ఈ సినిమా.  "హూ ఈజ్ ది గోల్డ్ ఫిష్?"(గోల్డ్ ఫిష్ ఎవరు) అంటూ ఆది ఎవరినో వెతుకుతూ ఉంటాడు.  ఈ సినిమాలో రచయిత అబ్బూరి రవి కరుడుగట్టిన తీవ్రవాది ఘాజీబాబా పాత్రలో నటించారు. 'కాశ్మీర్ పాకిస్తాన్ దే" అంటూ అందరూ తవ్రవాదులు చెప్పే అరిగిపోయిన రికార్డ్ వల్లె వేస్తుంటాడు.  ఒకవైపు అనిష్ కురువిల్లా "యూ కెనాట్ కిల్ ఘాజీ బాబా"(నువ్వు ఘాజీ బాబా ను చంపకూడదు) అంటూ ఉంటే.. ఆది మాత్రం ఆయనకోసం తీవ్రంగా గాలిస్తూ ఉంటాడు.. 'ఏక్ హిందుస్తాని కభీ వాదా నహీ తోడ్తా' (ఇచ్చిన మాటను ఒక భారతీయుడు ఎప్పుడూ తప్పడు) అంటూ ఒక పవర్ ఫుల్ డైలాగ్ కూడా చెప్తాడు.

ఓవరాల్ గా టీజర్ ఇంట్రెస్టింగ్ గానే ఉంది.  లీడ్ యాక్టర్లతో పాటుగా రావు రమేష్.. అనిష్ కురువిల్లా.. కృష్ణుడు లాంటి చాలామంది మంచి సపోర్టింగ్ ఆర్టిస్టులు కూడా ఉన్నారు.  దేశభక్తి థీమ్ కాబట్టి టీజర్ దాదాపు సీరియస్ గా సాగింది.  బ్యాక్ గ్రౌండ్ స్కోర్.. సినిమాటోగ్రఫి కూడా సినిమాకు తగ్గట్టు ఉన్నాయి.   అసలే జనాల్లో దేశభక్తి పొంగిపోతోంది కాబట్టి  ఈ సీజన్ లో కరెక్ట్ గా రావాల్సిన సినిమా.  మరి సినిమా రిలీజ్ అయ్యేలోపు ఘాజీబాబాను.. ఆయనను ఫాలో ఫాలో అంటున్న అర్జున్ ను ఒకసారి చూసేయండి.


Full View

Tags:    

Similar News