అవుట్ డేట్ అవుతున్నారంటే హాటు ఫోటో షూట్ల రచ్చ!

Update: 2019-08-05 14:30 GMT
గ్లామర్ ఇండస్ట్రీలో కెరీర్ ఎక్కువకాలం కొనసాగాలంటే సక్సెస్ మాత్రమే కాదు.. పీఆర్ స్కిల్స్ కూడా ఉండాలి.  ఏమాత్రం ఫేడ్ అవుట్ అవుతున్నామని తెలిసినా ఏదో ఒక పని చేసి లైమ్ లైట్ లో ఉండాలి.  ఒక హీరోయిన్ కు సినిమా ఆఫర్లు లేకుండా ఉన్నప్పుడు ఏం చేయకుండా ఊరుకుందనుకోండి.. అప్పుడు జనాలు ఆ భామను పూర్తిగా మర్చిపోయే ప్రమాదం ఉంది. ఇలాంటి ప్రమాదం ఉన్న భామలు ఈమధ్య కొత్త రూట్ ఫాలో అవుతున్నారు. అదే.. ఘాటు ఫోటోషూట్ల మంత్రం!

ఈమధ్య మీరు సోషల్ మీడియాను గమనిస్తే మంచి క్రేజ్ ఉన్న హీరోయిన్లతో పాటుగా.. ఫేడ్ అవుట్ అయిపోయిన హీరోయిన్లు.. మాజీలు కాబోతున్న హీరోయిన్లు.. అదే పనిగా ఘాటు ఫోటో షూట్లలో పాల్గొనడం.. ఎక్స్ పోజింగ్ చేయడం.. ఆ స్కిన్ షో ఫోటోలను తమ సోషల్ మీడియా ఖాతాల ద్వారా ఎడాపెడా పోస్ట్ చేయడం చాలా కామన్ గా మారిపోయింది.  బైబిల్ సూక్తులు.. ఖురాన్ పలుకులు.. గీత ప్రవచనాలు అంటే ఎంతమంది చదవడానికి ఉత్సాహం చూపిస్తారో ఏమో కానీ "హాటు భామ ఘాటు క్లీవేజ్ రచ్చ" అంటే చాలు..ఆ ఆర్టికల్ ఏ వెబ్ సైట్ లో అయినా మోస్ట్ పాపులర్ సెక్షన్ లో టాప్ 1 ప్లేసులో ఉంటుంది.  ఈ కిటుకును గమనించిన ఈ గ్లామర్ భామలు హాటు ఫోటో షూట్లతో నిజంగా రచ్చ చేసి పారేస్తున్నారు. అన్నీ వెబ్ సైట్లలో.. సోషల్ మీడియాలో తమ ఫోటోలు ట్రెండింగ్ లో ఉండేలా చూసుకుంటున్నారు.

ఈ కిటుకును ఈమధ్యే తెలుసుకున్న ఒక ఆకాశాలు తగ్గిన యాంకర్ ఉన్నట్టుంటి క్లీవేజ్ అందాలను బయట పెట్టడంతో కళాపిపాసులు సంతోషపడ్డా.. కొందరు హార్డ్ కోర్ అభిమానులు మాత్రం షాక్ అయ్యారు.. 'మేం ఇది ఊహించలేదు.. మీనుంచి ఇది ఆశించలేదు' అంటూ బాధ పడుతున్నారు. అయినా వారి ఫీలింగ్సు ముఖ్యమా.. అవకాశాలు ముఖ్యమా?


Tags:    

Similar News