డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్స్ హవా మొదలయ్యాక ఫిలిం మేకర్స్ కొత్త కొత్త ప్రయోగాలు చేస్తూ వస్తున్నారు. కరోనా లాక్ డౌన్ సమయంలో సౌత్ ఇండస్ట్రీ కూడా డిజిటల్ కంటెంట్ వైపు మళ్లింది. ఈ నేపథ్యంలో నలుగురు ఐదుగురు దర్శకులు కలిసి ఓ ఆంథాలజీ సిరీస్ లను నిర్మిస్తున్నారు. ఇప్పుడు తమిళ్ లో నాలుగు కథలతో ''పావ కధైగల్'' అనే ఆంథాలజీ సిరీస్ ని రూపొందించారు. నలుగురు కోలీవుడ్ స్టార్ డైరెక్టర్స్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ - వెట్రి మారన్ - సుధా కొంగర - విఘ్నేశ్ శివన్ ఈ ఆంథాలజీని డైరెక్ట్ చేశారు. నెట్ ఫ్లిక్స్ ఫ్లాట్ ఫార్మ్ లో విడుదల కానున్న 'పావ కధైగల్' టీజర్ ని శుక్రవారం రిలీజ్ చేశారు.
మానవ సంబంధాలపై ప్రేమ - పరువు - గౌరవం లాంటి అంశాలు ఎలాంటి ప్రభావం చూపాయనే విషయాన్ని నాలుగు అందమైన కథల నేపథ్యంలో ఈ సంకలనంలో ఆవిష్కరించారు. సంక్లిష్టమైన సంబంధాలను భావోద్వేగంతో కూడిన కథాంశాలతో రూపొందించినట్లు టీజర్ చూస్తే అర్థం అవుతోంది. ఇందులో సాయిపల్లవి - ప్రకాశ్ రాజ్ - సిమ్రాన్ - అంజలి - జయరాం - కల్కి కొచ్లిన్ - గౌతమ్ మీనన్ - భవానీ శ్రీ - కాళిదాసు - పదమ్ కుమార్ - శాంతను భాగ్యరాజ్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ఆర్‌ఎస్‌విపి మూవీస్ మరియు ఫ్లయింగ్ యునికార్న్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్స్ పై 'పావ కధైగల్' సిరీస్ నిర్మించబడింది. ఈ ఆంథాలజీ డిసెంబరు 18న నెట్ ఫ్లిక్స్ లో విడుదల కానుంది.
వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి :https://www.youtube.com/watch?v=GMFCLAIqCrQ&feature=youtu.be