సినిమాల దగ్గర దిగొచ్చిన పాకిస్తాన్

Update: 2016-12-18 11:10 GMT
ఇండియా పాకిస్తాన్ ల మధ్య యుద్ధం ఎప్పుడు సమసిపోతుంది అనే ప్రశ్నకు సమాధానం.. బహుశా ప్రపంచంలో ఎవరి దగ్గరా ఉండదేమో! భారత్ నుంచి సానుకూల చర్చల వాతావరణం వచ్చి.. సమస్యను తీర్చుకుందాం రమ్మనపుడే.. పాక్ వర్గాలు ఏదో ఒక వివాదం రేపి మళ్లీ ఇరు దేశాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొనేలా చేయడం ఆనవాయితీ. ఇలాగే రీసెంట్ గా సినిమాల విషయంలో కూడా కీలక నిర్ణయం తీసుకుంది పాక్. బాలీవుడ్ సినిమాలను అక్కడ పూర్తిగా నిషేధించేశారు.

ఇది అక్కడి సినీ ఇండస్ట్రీని దారుణంగా దెబ్బ తీసింది. నిజానికి బాలీవుడ్ సినిమాలకు పాకిస్తాన్ లో విపరీతమైన క్రేజ్ ఉంటుంది. అన్ని ఏరియాల్లోనూ విపరీతంగా ఆడేస్తుంటాయి. అయితే.. ఉరి ఘటనతో రెండు దేశాల మధ్య నెలకొన్న పరిస్థితుల కారణంగా బాలీవుడ్ పై పాక్ నిషేధం విధించింది. కానీ అక్కడి నిర్మాతల ఒత్తిడికి దిగిరాక తప్పలేదు. ఈ విషయంలో బాలీవుడ్ చాలా సైలెంట్ గానే ఉంది. ఇందుకు కారణం కూడా ఉంది. అసలు పాకిస్తాన్ లో రిలీజ్ చేయడం ద్వారా తమకు చిన్న మొత్తంలో లాభాలు తగ్గుతాయేమో తప్ప నష్టాలొచ్చే సమస్యే లేదని మనోళ్లు ఓపెన్ గానే కామెంట్ చేశారు.

కానీ పాక్ లో మాత్రం మొత్తం సినీ పరిశ్రమకే ఎఫెక్ట్ పడిపోయింది. దీంతో బాలీవుడ్ సినిమాలపై నిషేధం ఎత్తివేసి.. భారతీయ సినిమాల ప్రదర్శనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది పాక్. మరి.. పాక్ నటులను మన సినిమాల్లో నటించేందుకు ఇక్కడ పరిస్థితులు చక్కబడతాయా?

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News