దేశంలో కరోనా సెకండ్ వేవ్ భారీ నష్టాలను, భయాందోళనలు కలిగిస్తోంది. ప్రస్తుతం దేశంలో ప్రతిరోజూ లక్షల్లో కరోనా కేసులు నమోదు అవుతున్నాయి. వందల సంఖ్యలో సామాన్యులు మరణిస్తున్నారు. ఇలాంటి తరుణంలో సినిమా ఇండస్ట్రీ ఆల్రెడీ ఎక్కడికక్కడ దారులు మూసివేస్తోంది. ఇప్పటికే పలు రాష్ట్రాలలో సినిమా థియేటర్స్ మూతపడగా.. మరికొన్ని రాష్ట్రాలలో యాభైశాతం సీటింగ్ తో రన్ చేస్తున్నారు. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులలో ప్రేక్షకులు సినిమాలు థియేటర్లకు వచ్చి చూసే వాతావరణం కనిపించడం లేదు. ఇప్పటివరకు చాలా సినిమాలు తమ విడుదలను వాయిదా వేసుకున్నాయి. చూస్తుంటే దేశవ్యాప్తంగా సినీప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న పాన్ ఇండియా సినిమా కేజీఎఫ్-2 కూడా వాయిదా పడే అవకాశం ఉంది.
ఎందుకంటే పాన్ ఇండియా సినిమా కాబట్టి దేశవ్యాప్తంగా ఐదు భాషల్లో సినిమా రిలీజ్ కాబోతుంది. కానీ ఇప్పటికే కరోనా వలన అన్ని రాష్ట్రాలలో థియేటర్స్ ఓపెన్ లేవు. అలాగే వాటిని కొత్త సినిమాలు వేసి నడిపించే పరిస్థితి కూడా లేదు. ఇలాంటి సమయంలో జులై 16న కేజీఎఫ్2 రిలీజ్ డేట్ ప్రకటించిన మేకర్స్.. ఇప్పుడు సంధిగ్ధంలో పడినట్లు సమాచారం. ఎందుకంటే నార్త్ రాష్ట్రాలలో థియేటర్స్ పూర్తిగా మూతపడ్డాయి. ఇప్పట్లో తెరుచుకునే సూచనలు కూడా లేవని ప్రభుత్వాలు చెబుతున్నాయి. ఇలాంటి నేపథ్యంలో ఆల్రెడీ షూటింగ్ ముగించుకొని రిలీజ్ కు సిద్ధం అవుతున్న కేజీఎఫ్ విడుదల కరెక్ట్ కాదని మేకర్స్ భావిస్తున్నట్లు టాక్. మరి ఇప్పుడు వాయిదాపడితే మళ్లీ ఎప్పుడు రిలీజ్ అంటే.. దసరాకు రావొచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాను ప్రశాంత్ నీల్ తెరకెక్కించగా.. విజయ్ కిరగందుర్ నిర్మించారు.