అందానికి అందం .. ప్రతిభ.. అంతకుమించి ప్రయోగాత్మకత.. ఇదీ పారీ అలియాస్ పరిణీతి చోప్రా ఇంట్రడక్షన్. మాజీ మిస్సు ప్రియాంక చోప్రా కజిన్ అని కాదు కానీ.. పారీలో కూడా ఇంటర్నేషనల్ అప్పీల్ కనిపిస్తుంది సుమీ! ఇదిగో ఇదే అందుకు పెద్ద ప్రూఫ్. చూస్తుంటే... ఆ డిజైనర్ లుక్ కి మైండ్ బ్లాక్ అయిపోయివడం లేదూ?
బ్లాక్ టాప్.. దానికి కాంబినేషన్ గా బ్లాక్ చారలు ఉన్న ఖరీదైన సూట్ టైప్ వైవిధ్యమైన షర్ట్ ఆ మోడల్ లోనే విలక్షణత మైమరిపిస్తోంది. హాలీవుడ్ మూవీ రీమేక్ అయిన `ది గర్ల్ ఆన్ ది ట్రైన్` లో పరిణీతి చోప్రా అద్భుత నటనతో కట్టి పడేసిందని ఇంటర్నల్ గా ఇప్పటికే ప్రీమియర్లు చూసిన వారి నుంచి ప్రశంసలు కురిసాయి. ఇంతకుముందు ట్రైలర్ లో పారీ అప్పియరెన్స్ అదరగొట్టింది. ఈ చిత్రం ఫిబ్రవరి 26 న నెట్ ఫ్లిక్స్ లో విడుదల కానుంది.
`ది గర్ల్ ఆన్ ది ట్రైన్`లో తన పాత్ర తాను ఇంతకు ముందు చేసినదానికి భిన్నంగా ఉంటుందని పరిణీతి తాజా ఇంటర్వ్యూలో చెప్పింది. ఇందులో యాక్షన్ రోల్ లో సర్ ప్రైజ్ చేయబోతోంది. ముఖ్యంగా ట్రైన్ లో మందు కొట్టే అమ్మాయిగా నటించడం పెద్ద ఛాలెంజ్ అని కూడా తెలిపింది.
ప్రఖ్యాత ఆంగ్ల నవలా రచయిత పౌలా హాకిన్స్ రాసిన `ది గర్ల్ ఆన్ ది ట్రైన్` ఇప్పటికే 2016 లో హాలీవుడ్ లో రిలీజై ఘనవిజయం సాధించింది. ఎమిలీ బ్లంట్ ప్రధాన పాత్రలో నటించారు. ఆ పాత్రనే పారీ హిందీ రీమేక్ లో చేశారు.
రొమాంటిక్ డ్రామాలు ఇషాక్ జాదే- శుద్ధ్ దేశీ రొమాన్స్- హసీ తో ఫేసీ - మేరీ ప్యారీ బిందు వంటి చిత్రాల్లో నటించిన పరిణీతి చోప్రా... ఈ పాత్రను తన కెరీర్ లో ఒక పెద్ద ఛాన్స్ గా చూశానని పారీ అంటున్నారు. నేను యాక్షన్ భాగాన్ని చేయగలనని మేకర్స్ నాపై నమ్మకం కలిగి ఉన్నందుకు నేను కృతజ్ఞురాలిని. ఈ పాత్ర ఒక పెద్ద ఘనకార్యం లాంటిది అని పారీ అంది. ప్రతి ఒక్కరికీ ఇలాంటి పాత్రలు రావడం అరుదు అని కూడా తెలిపింది.
ఈ చిత్రంలో అదితి రావు హైడారి- కీర్తి కుల్హారీ- అవినాష్ తివారీ తదితరులు నటించారు. ఇక ఈ మూవీలో నటీనటులంతా ముందుగా నవలను చదివారట. అలాగే హాలీవుడ్ ఒరిజినల్ మూవీ చూసి ప్రేక్షకులకు ఇప్పటికే తెలిసిన పాత్రలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించారట. తాజాగా పరిణీతి మీడియా ఇంటర్వ్యూలతో బిజీగా ఉంటూనే మరోవైపు వరుస ఫోటోషూట్లను సోషల్ మీడియాల్లో షేర్ చేస్తోంది. అవన్నీ వైరల్ గా మారాయి. పారి స్పెషల్ షూట్ మరింతగా యువతరంలోకి దూసుకెళుతోంది.