పవన్ పై అలీ ప్రేమ.. జనసైనికుల ఆగ్రహం

Update: 2020-07-15 12:10 GMT
జనసైనికులకు ఆవేశం వచ్చినా.. అనుగ్రహం వచ్చినా తట్టుకోవడం చాలా కష్టమున్నట్టు ఉంది. అరే ఎన్నికల వేళ రెండు పార్టీల్లో ఉన్న ప్రాణ స్నేహితులు పవన్ కళ్యాణ్, అలీలు విడిపోయారు.. విమర్శించుకున్నారు. ఎన్నికలు అయిపోయాయి.. ఎవరి దుకాణం వారు చూసుకున్నారు.. దీంతో ఇప్పుడు పొగుడుకున్నా తప్పు అంటే ఎలా అని అలీ ఫ్యాన్స్ బాధపడుతున్నారట..

తాజాగా కమెడియన్ అలీ తన ప్రాణ మిత్రుడైన పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకొని అడ్వాన్స్ గా అతడిని పొగుడుతూ ట్విట్టర్ లో ఓ పోస్ట్ పెట్టాడు. ‘వ్యక్తిత్వం లో నిన్ను ఓడించలేనప్పుడు నీ కులం గుణం వర్ణం గురించి మాట్లాడుతారు... ఎవరు ఎన్ని విధాలుగా విమర్శించిన చెదరని నీ నవ్వుకి నీ సహనానికి శిరస్సు వంచి నమస్కారాలు.’ అంటూ లవ్ సింబల్ పెట్టి పోస్ట్ చేశాడు. పవన్ ఫ్యాన్స్ పెట్టిన ‘హ్యాపీ బర్త్ డే పవన్ కళ్యాణ్’ హ్యాష్ ట్యాగ్ కు మద్దతుగా ట్విట్టర్ లో ఈ వ్యాఖ్యలు పోస్టు చేశారు.

రాజకీయం పరంగా విడిపోయిన జనసేనాని పవన్ కళ్యాణ్, అలీలు సినిమాల పరంగా.. వ్యక్తిగతంగా మంచి స్నేహితులు.. పవన్ సినిమాలన్నింటిలోనూ అలీ ఉంటాడు. ఎన్నికల వేళ అలీ ఇదే పవన్ పై ఘాటు విమర్శలు చేయడంతో వీరిద్దరి మధ్య దూరం పెరిగింది.

అయితే పాత పగలన్నీ మరిచిపోయి అలీ తాజాగా చేసిన ఈ ట్వీట్ పై జనసైనికులు.. పవన్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల సమయంలో పవన్ ను తిట్టి ఇప్పుడు మీరు ప్రశంసించినా ఆ మాటలు మరిచిపోలేం అంటూ అలీపై ట్రోల్స్ మొదలుపెట్టారు. ఇప్పుడు అలీపై సోషల్ మీడియాలో ఓ రేంజ్ జనసైనికులు ఫైర్ అవుతున్నారు.

ఇలా పాత స్నేహితులు వైరాలు మరిచినా పవన్ ఫ్యాన్స్ మాత్రం వదలకపోవడమే ఇక్కడ విచిత్రం..
Tags:    

Similar News