తమిళంలో సూపర్ హిట్ అయిన వినోదయ సిత్తం సినిమా ను హిందీ మరియు తెలుగు లో రీమేక్ చేయాలని ఒకే సారి నిర్ణయించారు. తెలుగు లో పవన్ కళ్యాణ్ మరియు సాయి ధరమ్ తేజ్ లు ప్రధాన పాత్రల్లో ఒరిజినల్ వర్షన్ కి దర్శకత్వం వహించిన సముద్ర ఖని దర్శకత్వంలో రీమేక్ చేయాలని ఏర్పాట్లు మొదలు అయ్యాయి.
గత కొన్ని నెలలుగా త్రివిక్రమ్ మరియు సాయి మాధవ్ బుర్ర కలిసి రీమేక్ కోసం స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నారంటూ ప్రచారం జరిగింది. కానీ పవన్ కళ్యాణ్ రాజకీయాలతో బిజీగా ఉండటం వల్ల ఈ రీమేక్ కి డేట్లు ఇచ్చేందుకు వీలు పడటం లేదు. అన్ని అనుకున్నట్లుగా జరిగి ఉంటే ఇప్పటికే షూటింగ్ ప్రారంభం అయ్యి.. దాదాపుగా పూర్తి అయ్యేది.
కేవలం 45 రోజుల షూటింగ్ తోనే ఈ సినిమాను పూర్తి చేస్తామని అన్నారు. కానీ ఇంకా ప్రారంభమే కాలేదు. ప్రారంభం అయితే ఫాస్ట్ గా చేస్తారేమో కానీ.. ప్రారంభం అవ్వడమే కష్టంగా మారింది అంటూ ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో ఈ సినిమా రీమేక్ గురించిన చర్చ జరుగుతోంది.
ఇదే సమయంలో వినోదయ సిత్తం హిందీ రీమేక్ రెడీ అయ్యింది. అజయ్ దేవగన్ ప్రధాన పాత్రలో థాంక్యూ గాడ్ టైటిల్ తో రీమేక్ జరిగింది. తాజాగా ట్రైలర్ విడుదల అయిన ఈ రీమేక్ ను త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నట్లుగా ప్రకటించారు. కానీ తెలుగు రీమేక్ విషయం ఇంకా ఎటూ తేలడం లేదు.
పవన్ కళ్యాణ్ మొదట హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ ను ముగించాలని భావిస్తున్నాడట. ఆ సినిమా షూటింగ్ పూర్తి అయ్యేప్పటికి చాలా సమయం పట్టే అవకాశం ఉంది.. అప్పటి వరకు ఏపీలో ఎన్నికలు వస్తే వినోదయ సిత్తం అటకెక్కినట్లే అనేది కొందరి అభిప్రాయం. అందుకే పవన్ తో రీమేక్ పెట్టుకుంటే ఇలాగే ఉంటుందని కొందరు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.