'ఫోన్ భూత్' ట్రైలర్: బిజినెస్ ప్లాన్ తో వచ్చిన బ్యూటిఫుల్ భూతం..!

Update: 2022-10-10 10:39 GMT
హారర్ కామెడీ చిత్రాలను ఆదరించే ఓ వర్గం ప్రేక్షకులు ఎప్పుడూ ఉంటారు. గత కొంత కాలంగా సరైన హిట్టు కోసం ఎదురు చూస్తున్న బాలీవుడ్ పరిశ్రమకు ఊపిరి పోసింది కూడా 'భూల్ భూలైయా 2' వంటి హార్రర్ కామెడీ జానర్ లో తెరకెక్కిన సినిమానే. ఈ నేపథ్యంలో "ఫోన్ బూత్" అనే మరో సినిమా అదృష్టాన్ని పరీక్షించుకోడానికి వస్తోంది.

బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్ మరియు యువ హీరోలు ఇషాన్ ఖట్టర్ - సిద్ధాంత్ చతుర్వేది ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం "ఫోన్ భూత్". గుర్మీత్ సింగ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా రిలీజ్ కు రెడీ అయింది. ఇప్పటికే పోస్టర్లు - టీజర్ ఈ సినిమాపై ఆసక్తిని కలిగించగా.. తాజాగా మేకర్స్ ఆసక్తికరమైన ట్రైలర్ ని లాంచ్ చేశారు.

ట్రైలర్ లోకి వెళ్తే.. కత్రినా కైఫ్ ఇందులో ఒక భూతంగా కనిపించింది. సిద్ధాంత్ మరియు ఇషాన్ నిజమైన దెయ్యాలను చూడగల యువకులుగా కనిపించారు. అయితే దెయ్యమైన కత్రినా ఒక బిజినెస్ ప్లాన్ తో ఇద్దరు కుర్రాళ్లను సంప్రదించింది. ముగ్గురూ కలిసి ఆత్మలను వెల్లగొట్టి డబ్బు సంపాదించాలని అనుకుంటారు.

ఫోన్ బూత్ లో ఒకటి నొక్కితే ఆత్మలు దెయ్యాలు.. రెండు నొక్కితే మంత్రగత్తెలకు కనెక్ట్ అవుతుందని ట్రైలర్ లో చూపించారు. ఈ క్రమంలో వీరి మధ్య తలెత్తే సమస్యలు ఇబ్బందులు నవ్విస్తున్నాయి. అయితే సిద్ధాంత్ మరియు ఇషాన్ లతో కత్రినా కలవడం వెనుక ఓ రహస్య ఎజెండా ఉంది.

జాకీ ష్రాఫ్ పోషించిన ఆత్మారామ్ ను ఎదుర్కోడానికి కత్రినా ఏదో ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. అయితే ప్రధాన వైరుధ్యం ఏంటనేది ఈ ట్రైలర్ లో వెల్లడించలేదు. ఆద్యంతం ఫన్నీగా థ్రిల్లింగ్ సాగిన ఫోన్ బూత్ ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. విజువల్స్ మరియు బ్యాగ్రౌండ్ స్కోర్ దీనికి అదనపు ఆకర్షణగా నిలిచాయి.

సిద్ధాంత్ మరియు ఇషాన్ తమ తమ పాత్రల్లో అలరించగా.. కత్రినా కైఫ్ అందమైన దెయ్యంగా ఆకట్టుకుంది. ఈ చిత్రాన్ని రితేష్ సిద్వానీ మరియు ఫర్హాన్ అక్తర్ సంయుక్తంగా నిర్మించారు. "ఫోన్ భూత్" చిత్రాన్ని 2022 నవంబర్ 4న విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.

Full View

Tags:    

Similar News