పిక్ టాక్ : మీనా కొత్త ఫోటోలు వైరల్‌

Update: 2022-08-08 17:30 GMT
సౌత్ లో  ఒకప్పుడు స్టార్‌ హీరోయిన్‌ గా వెలుగు వెలిగిన మీనా ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ లో భాగంగా క్యారెక్టర్ ఆర్టిస్టుగా కొనసాగుతున్న విషయం తెల్సిందే. హీరోయిన్ గా మీనా నటిస్తున్న సమయంలో తెలుగు మరియు తమిళం తో పాటు ఇతర ఇండస్ట్రీలో నటీ నటులతో సన్నిహిత సంబంధాలు ఉండేవి. ఆ స్నేహం ఇప్పటికి కూడా కంటిన్యూ అవుతూ వస్తుంది.

మీనా సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా సక్సెస్‌ లు దక్కించుకుంటుంది.. హ్యాపీగా లైఫ్ ఉందని భావిస్తున్న సమయంలో అనూహ్యంగా ఆమె భర్త సాగర్ అనారోగ్యంతో మృతి చెందారు. ఆమె భర్త మృతి సమయంలో సోషల్‌ మీడియాలో రకరకాలుగా ప్రచారం జరిగింది. అనారోగ్య సమస్య గురించి ఎవరికి ఇష్టం వచ్చినట్లుగా వారు కామెంట్స్ చేస్తున్న సమయంలో మీనా స్పందించారు.

ఈ సమయంలో ఎవరికి తోచిన విధంగా వారు కథనాలు రాయవద్దని.. మేము చాలా బాధలో ఉన్నాయంటూ విజ్ఞప్తి చేసింది.

ఆమె విజ్ఞప్తి చేయడం తో సాగర్ మృతికి సంబంధించిన కథనాలకు బ్రేక్ పడ్డట్టు అయ్యింది. మీనా ఆ తర్వాత కూడా సోషల్ మీడియాలో వైరల్‌ అవుతూ వస్తుంది.

మీనా ను పరామర్శించేందుకు పెద్ద ఎత్తున ఆమె అభిమానులు వెళ్తున్నారు. ఆ సమయంలో స్నేహితులతో తీసుకున్న ఫోటోలను మరియు వీడియోలను సోషల్‌ మీడియా ద్వార మీనా షేర్‌ చేస్తూ వస్తున్నారు. భర్త చనిపోయిన మీనా ఇలా ఫోటోలను వరుసగా షేర్‌ చేయడంను కొందరు తప్పుడు కామెంట్స్ చేస్తూ ఉంటే మరి కొందరు మాత్రం ఆమెకు మద్దతుగా నిలుస్తున్నారు.

మీనా ను ఇటీవల కలిసిన వారిలో సంగీత.. సంఘవి.. రంభ వారి వారి కుటుంబ సభ్యులు ఉన్నారు. వారితో సరదాగా మీనా మరియు తన కూతురు కొంత సమయం సరదాగా గడిపారు. ఆ ఫోటోలు ఇలా షేర్‌ చేశారు. సీనియర్ హీరోయిన్స్ ను ఒకేసారి ఒకే ఫ్రేమ్‌ లో ఇలా చూడటం చాలా సంతోషంగా ఉందంటూ కొందరు అప్పటి ప్రేక్షకులు అభిప్రాయం వ్యక్తం చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు.
Tags:    

Similar News