'భీమ్లా నాయ‌క్` ప్రీ రిలీజ్ కి పోలీసుల కండీష‌న్స్‌!

Update: 2022-02-22 16:54 GMT
ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ - రానా తొలిసారి క‌లిసి న‌టించిన చిత్రం `భీమ్లా నాయ‌క్‌`. ఎప్పుడెప్పుడు విడుద‌ల‌వుతుందా? అని అభిమానులు ఆస‌క్తిగా ఎదురుచూస్తున్న ఈ క్రేజీ మూవీ ఈ నెల 25న అత్యంత భారీ స్థాయిలో ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల కానుంది. సోమ‌వారం ట్రైల‌ర్ రిలీజ్ చేయ‌డంతో సినిమాపై హైప్ మ‌రింత పెరిగింది. ట్రైల‌ర్ లో ప‌వ‌న్‌, రానాల‌ని చూపించిన తీరు, నువ్వా నేనా అంటూ ఇద్ద‌రు హీరోలు న‌టించిన తీరు అభిమానుల‌తో పాటు సినీ ప్రియుల‌ని ఆక‌ట్టుకుంది.

సినిమా రిలీజ్ ద‌గ్గ‌ర ప‌డుతున్న నేప‌థ్యంలో ప్ర‌మోష‌న్స్ ని స్పీడ‌ప్ చేసిన మేక‌ర్స్ ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ఈ నెల 23న భారీగా ప్లాన్ చేశారు. హైద‌రాబాద్ యూస‌ఫ్ గూడాలోని పోలీస్ గ్రౌండ్స్ లో సాయంత్రం 6 గంట‌ల‌కు ప్రారంభం కానున్న ఈ ప్రీరిలీజ్ ఈవెంట్ కి ఛీఫ్ గెస్ట్ గా గులాబీ అధినేత కేటీఆర్, ప్ర‌త్యేక అతిథిగా సినిమాటోగ్ర‌ఫీ మంత్రి త‌ల‌సాని శ్రీ‌నివాస యాద‌వ్ పాల్గొన‌బోతున్నారు. ఇందు కోసం ఇప్ప‌టికే యూస‌ఫ్ గూడాలోని పోలీస్ గ్రౌండ్స్ లో ఏర్పాట్లు పూర్తి చేశారు.

ఇదిలా వుంటే ఈ ఈవెంట్ కి సంబంధించి పోలీసులు అభిమానులకు ప‌లు సూచ‌న‌లు, కండీష‌న్ లు పెట్టారు. ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చూడ‌టం..అన‌వ‌స‌ర గొడ‌వ‌ల‌ని.. తొక్కిస‌లాట‌ల‌ని నివారించాల‌ని  అందుకు ముందు జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని పోలీసులు సూచించారు. ఈ సంద‌ర్భంగా పోలీసు శాఖ వారు కీల‌కంగా మ‌రిన్ని సూచ‌న‌ల‌ని చేశారు.

పోలీసులు చేసిన సూచ‌న‌లు ఇలా వున్నాయి

* ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం నిర్దేశించిన పాసులు ఉన్న‌వారికే లోనికి అనుమ‌తి

* ఫిబ్ర‌వ‌రి 21న ఈవెంట్ కోసం ఇచ్చిన పాసులు చెల్ల‌వు. కొత్త పాసులు వున్న‌వారినే లోనికి అనుమ‌తిస్తారు.

*వంద‌ల సంక్ష‌లో వామ‌నాలు వ‌స్తే  స‌రైన పార్కింగ్ ల‌భించ‌డం క‌ష్టం. వ్య‌క్తిగ‌త వాహ‌నాల‌లో కాకుండా ప‌బ్లిక్ ట్రాన్స్ పోర్ట్ ద్వారా స‌భా స్థ‌లికి చేరుకుంటే మంచిది.

* పాసులు లేనివారు గ్రౌండ్ వ‌ద్ద‌కు వ‌చ్చి గుమిగూడ‌టానికి ఎట్టిప‌రిస్థితుల్లో అనుమ‌తి లేదు.

* పాసులు లేకుండా దూర ప్రాంతాల నుంచి వ‌చ్చి ఇబ్బందులు ప‌డొద్దు. ద‌య‌చేసి ప‌నులు లేని వారు రావ‌ద్దు.

* ప్రీ రిలీజ్ ఈ వెంట్ జ‌రిగే ప్రాంతానికి ప‌నులు లేకుండా వ‌చ్చి గొడ‌వ పెడితే వారిపై చ‌ట్ట‌ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకుంటాం.

* మ‌ధ్యాహ్నం 2 గంట‌ల నుంచి రాత్రి 11 గంట‌ల మ‌ధ్య యూస‌ఫ్ గూడ చెక్ పోస్ట్‌.. కోట్ల విజ‌య‌భాస్క‌ర్ రెడ్డి స్టేడియం ప‌రిస‌ర‌ప్రాంతాల్లో ట్రాఫిక్ ర‌ద్దీ ఏర్ప‌డే అవ‌కాశం వుంది. కాబ‌ట్టీ వాహ‌న‌దారులు ప్ర‌త్యామ్న‌య మార్గాల‌ను ఎంకిచ చేసుకోవండీ.

*జూబ్లీ హిల్స్ ర‌కోడ్ నెం. 5 నుంచి యూస‌ఫ్ గూడా వైపు వెళ్లే వాళ్లు క‌మ‌లాపురి కాల‌నీ రోడ్డును ఎంచుకోవాలి.

* అమీర్ పేట్ నుంచి యూస‌ఫ్ గూడా మీద‌గా జూబ్లీ హిల్స్ వెళ్లే వారు గ‌ణ‌ప‌తి కాంప్లెక్స్ మీదుగా క‌మ‌లాపురి కాల‌నీ రోడ్డు ఇందిరాన‌గ‌ర్ మీదుగా వెళ్తే మంచిది.

* ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం వ‌చ్చి వారు త‌మ వాహ‌నాల‌ను నిర్దేశించిన ప్ర‌దేశాల్లో మాత్ర‌మే పార్క్ చేయాలి.  రోడ్డు మీద పార్క్ చేస్తే సీజ్ చేయ‌డంతో పాటు త‌గిన చ‌ర్య‌లు తీసుకుంటాం.
Tags:    

Similar News