ముఖ్యమంత్రి ఎక్కువ? సినిమా హీరో ఎక్కువా? అంటే.. ముఖ్యమంత్రికే తమ ఛాయిస్ ఇస్తారు. మామూలు వ్యక్తుల పరిస్థితే ఇలా ఉంటే.. విధి నిర్వహణలో ఉన్న భద్రతా సిబ్బంది మరెంత జాగ్రత్తగా ఉండాలి. కానీ.. అదేమీ లేకుండా ముఖ్యమంత్రి భద్రత కోసం నియమించిన పోలీసులు.. తమ విధుల్ని వదిలేసి సినీ నటుడు ప్రభాస్ సేవలో తరించేందుకు మక్కువ చూపటం కలకలం రేగుతోంది. పోలీసు ఉన్నతాధికారులు తీవ్ర ఆగ్రహానికి గురైన ఈ ఘటనపై విస్మయం వ్యక్తం కావటమే కాదు.. ఆందోళన కలిగించే పరిస్థితి.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వెళ్లే రహదారిలో బందోబస్తుగా కొందరు పోలీసుల్ని నియమించారు. శుక్రవారం ముఖ్యమంత్రి కేసీఆర్ మాదాపూర్ లో జరిగే కార్యక్రమానికి వెళ్లే సమాచారం ఉంది. దీంతో.. ఆ రూట్ లో బందోబస్తు కోసం పోలీసుల్ని నియమించారు. డ్యూటీలో ఉన్న వారు తమ విధి నిర్వహణను వదిలేసి.. అక్కడే ఉన్న సినీనటుడు ప్రభాస్ ఇంటికి వెళ్లటం గమనార్హం. సినీ నటుడు ప్రభాస్ తో ఫోటోలు దిగేందుకు ఆయన అభిమానులు ఆయన ఇంటికి వస్తున్నారని తెలిసి.. డ్యూటీ వదిలేసి.. ప్రభాస్ ఇంటి వైపు వెళ్లిన విషయం పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి వచ్చింది. ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఇలాంటి పని చేసిన పోలీసులపై అధికారులు తీవ్రస్థాయిలో అగ్రహం వ్యక్తం చేయటమే కాదు.. ఈ మొత్తం వ్యవహారంపై నివేదిక కోరినట్లు తెలుస్తోంది.