పవన్ లాంటివాడు నాకు కావలెను

Update: 2017-06-30 04:30 GMT
తెలుగు సినిమా హీరోలులలో మీకు ఎవరు అంటే ఇష్టం అని మీరు ఎవరినైనా అడిగితే ముఖ్యంగా యూత్ ని అడిగితే మనకు 80 శాతం వినిపించే పదం పవర్ స్టార్. ఈ హీరోకి ప్రేక్షక అభిమానం తోపాటు తోటి హిరోయిన్లు, వస్తున్న చిన్న హీరోలు ఇలా చాలామంది అభిమానం ఉంది. చేసినవి ఏమైనా ఎక్కువ సినిమాల అంటే అది లేదు. అయినాసరే విపరీతమైన క్రేజ్ ను సొంతం చేసుకున్నాడు పవన్. ముఖ్యంగా అందరూ మాట్లాడేది అతని నిజాయితీ గురించి అతని ఆలోచన నడవడిక గురించే. అదే పవన్ కల్యాణ్ ను జనాలులోకి తీసుకువెళ్లింది.

ఒక పెద్ద హిట్ కొట్టి 10 ఏళ్ళు మళ్ళీ అంతే పెద్ద  హిట్ లేకుండా తన క్రేజ్ తగ్గకుండా ఉన్నాడు అంటే అది అతని సినిమాలు చూసి ప్రేక్షకులు అభిమానులు కాలేదుని అర్ధం అవుతుంది. అది నిజంగా అతని మాటలోని నిజం అనే చెప్పాలి. ఆ నిజనికే అందరూ పడిపోయారు. ఒక హీరోయిన్ అయితే ఏకంగా నా కాబోయే భర్త పవన్ కల్యాణ్ లాంటి వ్యక్తిత్వం ఉండాలి లేకుంటే నేను పెళ్లి చేసుకోను అంటుంది. తెలుగు హీరోయిన్ పూనమ్ కౌర్ ఒక ఇంటర్వ్యూ లో మీకు కాబోయే వాడు ఎలా ఉండాలి అంటే.. “ పవన్ కల్యాణ్ లాంటి వాడు కావాలి” అని టక్కున చెప్పింది. కోరిక బాగానే ఉంది కానీ ఇప్పటికీ ఇప్పుడు జూనియర్ పవన్ కల్యాణ్ ను ఎక్కడ నుండి తీసుకురావాలి చెప్పండి.

ఈ మధ్యకాలంలో హీరోలే కాకుండా ఇలా హీరోయిన్లు కూడా పవర్ స్టార్ అనే భజన బాగానే చేస్తున్నారు. మరి వీళ్లందరూ రేపు పవన్ పొలిటికల్ ఐడియాలజీతో సింక్ అయ్యి.. జనసేన వైపు నడుస్తారా ఏంటి? వీళ్లు నడిచినా ఆయన వీళ్లను నడవనిస్తాడా? అది ఇంకో స్టోరీ!!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News