టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుండి కొత్త మూవీ వస్తుందంటేనే తెలుగు ప్రేక్షకులలో అంచనాలు తారాస్థాయిలో నెలకొంటాయి. ఇటీవలే వకీల్ సాబ్ మూవీతో సూపర్ హిట్ అందుకున్న పవర్ స్టార్.. తదుపరి 'హరిహర వీరమల్లు' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇప్పటికే వీరమల్లు ఫస్ట్ గ్లింప్స్ విడుదలై సినిమా పై అంచనాలు రెట్టింపు చేసాయి. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్నటువంటి వీరమల్లు సినిమా గురించి ఎలాంటి వార్త తెలిసినా అభిమానులకు పండగే అవుతుంది. పవర్ స్టార్ 27వ సినిమాగా వీరమల్లు సినిమా క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతుంది. సీనియర్ ప్రొడ్యూసర్ ఏయం.రత్నం వీరమల్లు సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు.
అయితే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ కరోనా బారినుండి కోలుకోని షూటింగ్ లో పాల్గొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తుంది. స్వయంగా ఈ విషయాన్ని ప్రొడ్యూసర్ ఏఎం రత్నం మీడియాతో ఇటీవలే వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ లో పాల్గొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపాడు. ప్రస్తుతం ఉన్నటువంటి కరోనా పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని సెట్ లో ఖచ్చితమైన జాగ్రత్తలు తీసుకోవాలని కోరినట్లు రత్నం తెలిపారు. అలాగే సెట్ లోకి వచ్చే ఏ ఒక్కరూ కరోనా బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోండి. సినిమా ఆలస్యమైనా పరవాలేదని చెప్పినట్లు ఆయన చెప్పుకొచ్చారు.
ఇదిలా ఉండగా.. తాజాగా వీరమల్లు సినిమా కథ గురించి సోషల్ మీడియాలో పలు కథనాలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ సినిమా మొఘలుల కాలంనాటి సామ్రాజ్యంలో వీరమల్లు అనే బందిపోటు కథతో తెరకెక్కుతున్నట్లు తెలుస్తుంది. హాలీవుడ్ సినిమా తరహాలో ఈ సినిమాలో రాబిన్ హుడ్ లాంటి పాత్రలో పవన్ కళ్యాణ్ ధనికులను దోచి పేదలకు పంచే కాన్సెప్ట్ తో రానుందని టాక్. అలాగే పలు సామాజిక అంశాలను కూడా ఈ సినిమాలో చర్చించనున్నట్లు తెలుస్తుంది. పీరియడిక్ చిత్రం కావడంతో భారీ సెట్లను ఆ కాలం నాటి నేటివిటీని ప్రతిబింబించేలా రూపొందిస్తున్నట్లు చిత్రవర్గాలు చెబుతున్నాయి. పవన్ కళ్యాణ్ కెరీర్లోనే ఫస్ట్ పీరియడిక్ మూవీ ఇది. పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఫస్ట్ హిస్టారికల్ మూవీ కాబట్టి చరిత్రలో నిలిచిపోయే విధంగా ఉండాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. ఈ సినిమా వచ్చేఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ కాబోతుంది.