#ప్ర‌భాస్ 21.. RRR ని మించి పాన్ వ‌ర‌ల్డ్ షేక‌య్యేలా!

Update: 2021-03-11 08:30 GMT
డార్లింగ్ ప్ర‌భాస్ బ్యాక్ టు బ్యాక్ పాన్ ఇండియా సినిమాల్లో న‌టిస్తూ బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. ఓవైపు ఆదిపురుష్ 3డి.. మ‌రోవైపు స‌లార్ చిత్రాల షూటింగుల‌కు ఎటెండ‌వుతున్నాడు. ఈలోగానే నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో అశ్వ‌నిద‌త్ నిర్మించే భారీ పాన్ వ‌ర‌ల్డ్ సినిమా కోసం ప్రిప‌రేష‌న్స్ సాగిస్తున్నాడు. జూన్ నుంచి ఈ భారీ సైన్స్ ఫిక్ష‌న్ సినిమాని ప‌ట్టాలెక్కించాల‌న్న‌ది ద‌ర్శ‌క‌నిర్మాత‌ల ప్లాన్.

ప్ర‌భాస్ కెరీర్ 21 వ చిత్ర‌మిది. ఈ సినిమాని దేశ‌చ‌రిత్ర‌లోనే న‌భూతోన‌భ‌విష్య‌తి అన్న తీరుగా తెర‌కెక్కించాల‌న్న‌ది అశ్వ‌నిదత్ ప్లాన్. ఇది ఒక ర‌కంగా సైన్స్ ఫిక్షన్ జోడించిన సూపర్ హీరో చిత్రం. ప్ర‌భాస్ కెర‌ర్ లో తొలి సూప‌ర్ హీరో చిత్రంగానూ రికార్డుల‌కెక్క‌నుంది. టాలీవుడ్ అగ్ర‌ బ్యానర్ వైజయంతి మూవీస్ 50వ సంవత్సరంలో ప్ర‌వేశిస్తున్న సంద‌ర్భంగా ఎంతో  ప్ర‌తిష్ఠాత్మ‌కంగా ఈ చిత్రాన్ని అత్యంత భారీ బ‌డ్జెట్ తో నిర్మిస్తోంది.

ఈ సినిమా కాస్టింగ్ స‌హా ప్ర‌తిదీ ఇటీవ‌ల హాట్ టాపిక్ గా మారాయి. ఇందులో దీపిక ప‌దుకొనే క‌థానాయిక‌గా న‌టిస్తుండ‌గా.. బిగ్ బి అమితాబ్ బ‌చ్చ‌న్ ఓ కీల‌క పాత్ర‌ను పోషించ‌నున్నారు. ఆ ఇద్ద‌రి చేరిక‌తో భారీ పాన్ వ‌ర‌ల్డ్ అప్పీల్ క‌నిపిస్తోంద‌న్న టాక్ ట్రేడ్ లోనూ వినిపిస్తోంది.

తాజా స‌మాచారం ప్ర‌కారం.. నిర్మాత అశ్విని దత్ ఈ చిత్రాన్ని దాదాపు 400 కోట్ల బ‌డ్జెట్ తో మునుపెన్న‌డూ చూడ‌ని గొప్ప విజువ‌ల్ వండ‌ర్ గా ఈ మూవీని తెర‌కెక్కించాల‌ని ప్లాన్ చేస్తున్న‌ట్టు తెలిసింది. భారతదేశంలో ఇప్పటివరకు చేసిన అత్యంత కాస్ట్ లీ చిత్రాల వ‌రుస‌లో ఒకటిగా నిల‌వ‌నుంద‌ని తెలుస్తోంది.

ఇండియ‌న్ సినిమా హిస్ట‌రీలో 2.0 దాదాపు 450కోట్ల బ‌డ్జెట్ తో అత్యంత కాస్ట్ లీ చిత్రంగా నిలిచింది. ఆ త‌ర్వాత ఆర్.ఆర్.ఆర్ చిత్రాన్ని 350కోట్ల బ‌డ్జెట్ తో తెర‌కెక్కిస్తున్నార‌ని ప్ర‌చారమ‌వుతోంది. కానీ ఇప్పుడు ఆర్.ఆర్.ఆర్ ని మించి ప్ర‌భాస్ 21 కోసం ఖ‌ర్చు చేయ‌నున్నారు. ఇంత‌కుముందు ప్రభాస్ న‌టించిన బాహుబ‌లికి 250కోట్లు ఖ‌ర్చు చేయ‌గా పార్ట్ 2 ని 300కోట్ల బ‌డ్జెట్ తో తెర‌కెక్కించార‌ని ప్ర‌చార‌మైంది. వాట‌న్నిటినీ మించి ప్ర‌భాస్ 21 కోసం ఖ‌ర్చు చేస్తుండ‌డం ఆస‌క్తిని రేకెత్తిస్తోంది.  

దేశ‌విదేశాల్లో ప్ర‌భాస్ కి వీరాభిమానులున్నారు. అత‌డికి హిందీ మార్కెట్ ప‌రంగా బోలెడంత క్రేజు ఉంది. అమితాబ్ - దీపిక‌కు పాన్ వ‌ర‌ల్డ్ అప్పీల్ ఉంది కాబ‌ట్టి రిట‌ర్న్స్ ర‌ప్పించ‌డం పెద్ద క‌ష్ట‌మేమీ కాద‌ని అంచ‌నా వేస్తున్నారు.
Tags:    

Similar News