పూజా హెగ్డే పై ప్రభాస్ ఫ్యాన్స్ ఫైర్

Update: 2022-03-10 10:30 GMT
ప్రభాస్.. పూజా హెగ్డే నటించిన రాధేశ్యామ్‌ సినిమా మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా లో ప్రభాస్ విక్రమాధిత్య గా కనిపించబోతున్నాడు. ఇక ప్రేరణ పాత్ర లో పూజా హెగ్డే నటించిందని మొదటి నుండి చిత్ర యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు. ఈ సినిమా షూటింగ్‌ సమయంలో హీరోయిన్ పూజా హెగ్డే విషయంలో ప్రభాస్‌ మరియు నిర్మాతలు అసంతృప్తి వ్యక్తం చేశారనే పుకార్లు షికార్లు చేశాయి.

అవి నిజంగానే పుకార్లు అంటూ తేల్చి చెప్పేలా ప్రభాస్‌ మరియు పూజా హెగ్డే లు కలిసి రాధేశ్యామ్‌ సినిమా పబ్లిసిటీ కార్యక్రమాలకు హాజరు అవుతున్నారు. ముంబై.. చెన్నై.. హైదరాబాద్ మరియు ఢిల్లీ ఇలా ప్రతి చోటుకు కూడా ప్రభాస్ తో కలిసి పూజా హెగ్డే వెళ్లి సందడి చేసింది.

సినిమా ప్రమోషన్ విషయంలో క్రియాశీలకంగా పూజా హెగ్డే వ్యవహరించడం జరిగింది. కాని ఆ సమయంలో పూజా హెగ్డే వ్యవహరించిన తీరు మాత్రం అభిమానులకు కోపం ను తెప్పించింది.

అసలు విషయం ఏంటీ అంటే.. రాధేశ్యామ్ సినిమా ప్రమోషన్‌ లో భాగంగా ఇచ్చిన తన ప్రతి ఇంటర్వ్యూలో కూడా ఆమె నటించిన.. నటించబోతున్న సినిమాలకు సంబంధించిన విషయాలను చెబుతూ వస్తోంది.

ముఖ్యంగా విజయ్ తో కలిసి నటించిన బీస్ట్‌ గురించి.. ఇతర సినిమాల గురించి ఆమె ప్రస్థావించడం జరిగింది. మీడియా వారు ఆ సినిమాలకు సంబంధించిన ప్రశ్నలు అడిగినా కూడా స్కిప్‌ చేయాల్సి ఉంటుంది. కాని ఆమె మాత్రం స్పందిస్తూ ఆ సినిమాల పబ్లిసిటీ చేసిందనే ట్రోల్స్ వస్తున్నాయి.

ఆమద్య కంగనా రనౌత్‌ ను మీడియా సమావేశంలో ఒక సినిమా గురించి ప్రశ్నించిన సమయంలో జర్నలిస్ట్ కు నేను కనీసం ఆ సినిమా పేరును కూడా ఎత్తను.. మీరు ఆ సినిమా పబ్లిసిటీ చేయాలనుకోవడం నా వద్ద కుదరదు అంటూ కౌంటర్ ఇచ్చింది. అలా చాలా మంది స్టార్స్ కూడా  తాము ఏ సినిమా గురించి మాట్లాడుతున్నామో ఆ సినిమా గురించిన విషయాలను మాత్రమే చెప్తారు.

పూజా హెగ్డే మాత్రం అన్ని సినిమాలకు సంబంధించిన వ్యవహారాలను మరియు ముచ్చట్లను చెప్పుకుని రావడంతోనే ప్రభాస్‌ అభిమానులు ఒకింత అసంతృప్తితో ఉన్నారనే టాక్ వినిపిస్తుంది.

మొన్నటి వరకు రాధేశ్యామ్‌ సినిమా షూటింగ్‌ సమయంలో మేకర్స్‌ ను ఇబ్బందికి గురి చేసిందంటూ కామెంట్స్ వచ్చాయి. కాని ఇప్పుడు మాత్రం ఆమె రాధేశ్యామ్‌ సినిమా ప్రమోషన్ లో వేరే సినిమాల ను ప్రమోట్‌ చేస్తుందంటూ విమర్శలు ఎదుర్కొంటుంది.

Tags:    

Similar News