‘బాహుబలి’ తర్వాత ప్రభాస్ నేషనల్ స్టార్ అయిపోయాడు. దేశవ్యాప్తంగా అతడికి తిరుగులేని గుర్తింపు వచ్చింది. అతడి ఇమేజ్.. మార్కెట్ అన్నీ చాలా విస్తరించాయి. చాలా పెద్ద స్టార్ అయిపోయాడు ప్రభాస్. ఐతే ఈ స్టార్ ఇమేజ్ ను తాను ఎంతమాత్రం ఆస్వాదించలేనని అంటున్నాడు ప్రభాస్. అసలు స్టార్ డమ్ ను ఎలా డీల్ చేయాలో కూడా తనకు తెలియదని ప్రభాస్ చెప్పాడు. దశాబ్దం పైగా ఇండస్ట్రీలో ఉన్నా.. ఇప్పటికీ తనకు బిడియమే అని.. జనాల ముందుకు వెళ్లడమంటే తనకు చాలా భయం అని ప్రభాస్ చెప్పాడు.
‘‘ఇంటర్వ్యూలంటే నాకు ఇప్పటికీ చాలా సిగ్గుగా అనిపిస్తుంది. నా సినిమాలకు చాలా మంది జనాలు రావాలి.. చూడాలి అనిపిస్తుంది. కానీ నేను మాత్రం జనాల ముందుకు వెళ్లలేను. 13-14 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నప్పటికీ స్టార్ డమ్ ఎలా డీల్ చేయాలో నాకు తెలియదు. తమ హీరో ఎక్కువగా బయటికి రాడని నా అభిమానులు ఫీలవుతుంటారు. ఐతే గతంతో పోలిస్తే ఈ విషయంలో నేను మెరుగయ్యాను కానీ.. ఇంకా ఫ్రీ అవ్వాల్సి ఉంది’’ అని ప్రభాస్ తెలిపాడు.
తన కుటుంబం తనను సినిమాల్లోకి వెళ్లమన్నపుడు కూడా ముందు తాను తిరస్కరించినట్లు ప్రభాస్ తెలిపాడు. ‘‘మా పెదనాన్న నటుడు. మా నాన్న నిర్మాత. వాళ్లిద్దరూ నన్ను సినిమాల్లోకి వెళ్లమన్నారు. కానీ ‘అంతమంది జనాలు.. లైట్లు ఉండగా ఎవరైనా ఎలా నటిస్తారు.. ఎమోషన్లు పలికిస్తారు’ అనిపించేది. వాళ్లు ఒకటికి రెండుసార్లు అడిగినా కాదన్నాను. బిజినెస్ చేద్దామని అనుకున్నాను. కానీ నేనో సోమరిని. అలాంటి స్థితిలో ఒకరోజు బాపు గారి దర్శకత్వంలో పెదనాన్న నటించిన ఓ సినిమా చూస్తూ.. ఆయన పాత్రలో నన్ను ఊహించుకున్నాను. అప్పుడు నెమ్మదిగా నాలో నటుడు కావడంపై ఆలోచన మొదలైంది. తర్వాత సినిమాల్లోకి రావడానికి అంగీకరించాను’’ అని ప్రభాస్ చెప్పాడు.