సాహో బడ్జెట్ ఎంత? ఆరంభం 225 కోట్లు అన్నారు. ఆ తర్వాత 250 కోట్లకు పెంచారని వార్తలొచ్చాయి. కాలక్రమంలో అది కాస్తా 300 కోట్లకు పెరిగిందని కాన్వాసును అమాంతం పెంచారని ప్రచారం సాగింది. ఇలా సాగిన ప్రచారంలో ఏది నిజం ఏది అబద్ధం? అన్నది ఎవరికీ అర్థం కాలేదు. అయితే ఇదే సందేహం డార్లింగ్ ప్రభాస్ వద్ద ఓ జర్నలిస్ట్ వ్యక్తం చేశారు. దానికి అతడు ఇచ్చిన సమాధానం.. సాహో బడ్జెట్ 250 కోట్లు కాదు 350 కోట్లు అని.
ఈ భారీ చిత్రానికి సంబంధించి ఇంకా చాలా విషయాలు తెలిశాయి. ఈ సినిమా షూటింగ్ ని మొత్తం 227 రోజుల్లో పూర్తి చేశారు. అత్యంత భారీ ఖర్చుతో మొత్తం 70 సెట్లు వేశారు. అబూదబీ ఛేజ్ కోసం ఏకంగా 80కోట్లు ఖర్చు చేశారు. కొన్ని కొన్ని కీలకమైన షాట్ల కోసం సెట్లను ఉపయోగించిన సందర్భాలు ఎక్కువ. అంతేకాదు ఈ సినిమా ప్రీరిలీజ్ కి ఏకంగా 1.7 కోట్లు ఖర్చు చేస్తున్నారని `తుపాకి`కి ఎక్స్ క్లూజివ్ గా సమాచారం అందింది. శ్రేయాస్ మీడియా ఈ ప్రీరిలీజ్ ఈవెంట్ ని చేస్తోంది.
ఈనెల 18న రామోజీ ఫిలింసిటీలో భారీగా ప్రీరిలీజ్ వేడుక జరగనుందని ఇదివరకూ ఎక్స్ క్లూజివ్ గా వెల్లడించాం. ప్రస్తుతం దేశంలోని మెట్రో నగరాల్లో ఏ రోజు ఏ షెడ్యూల్ అన్నది వివరాలు తెలిశాయి. ఈనెల 16న కేరళలో సాహో టీమ్ ప్రెస్ మీట్ ఉంటుంది. ఆ మరుసటి రోజు కేరళ మీడియాతో ప్రభాస్ సహా కీలక వ్యక్తుల ఇంటర్వ్యూలు ఉంటాయి. మూడు రోజుల పాటు అంటే ఆగస్టు 19.. 20.. 21 తేదీల్లో ముంబై మీడియాకి ఇంటర్వ్యూలు ఉంటాయి. ఆ తర్వాత 22న చెన్నయ్ లో ప్రెస్ మీట్ జరగనుంది. 23న చెన్నయ్ మీడియాతో సాహో బృందం ఇంటరాక్షన్ సెషన్స్ ఉంటాయి. అన్ని మెట్రోల్లో మీడియా ఇంటరాక్షన్స్ కి ప్రత్యేకించి సమయం కేటాయిస్తారు ప్రభాస్. 23 నుంచి 30వ తేదీ వరకూ ప్రభాస్ అండ్ టీమ్ కి రకరకాల ప్రచార కార్యక్రమాల షెడ్యూలు ఉంటుందట. ఆ మేరకు తుపాకీకి ఎక్స్ క్లూజివ్ సమాచారం అందింది.